స్లో ల్యాప్‌టాప్‌ని ఇలా సూపర్ ఫాస్ట్ చేయండి!

మనలో చాలామంది వ్యక్తిగత, ఆఫీసు పనుల కోసం ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తాం.కానీ కాలక్రమేణా ల్యాప్‌టాప్ వేగం తగ్గడం ప్రారంభమవుతుంది.

 How To Make Slow Speed Laptop Superfast , Laptop, Unnecessary Tabs , Restart ,-TeluguStop.com

నెమ్మదిగా పని చేసే ల్యాప్‌టాప్ మీ పని తీరును ప్రభావితం చేయడమే కాకుండా మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.అయితే మీ ల్యాప్‌టాప్ స్పీడ్‌ను చాలా వరకు పెంచే 5 సులభమైన ఉపాయాలను ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాం.

1.అనవసరమైన ట్యాబ్‌లను క్లోజ్ చేయండి!

మీరు ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒకేసారి చాలా ట్యాబ్‌లను తెరిస్తే, అది మీ ల్యాప్‌టాప్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.చాలా ఇంటర్నెట్ పేజీలు నిరంతరం రిఫ్రెష్ అవుతుంటాయి.అవి ల్యాప్‌టాప్‌లోని RAMని ఉపయోగిస్తాయి.కాబట్టి అనవసరమైన ట్యాబ్‌లను ఎల్లప్పుడూ క్లోజ్ చేయండి.

2.అనవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి

మీ ల్యాప్‌టాప్‌ను ఎక్కువ సాఫ్ట్‌వేర్‌లతో నింపవద్దు.సాఫ్ట్‌వేర్.

ల్యాప్‌టాప్ ఇంటర్నల్ స్టోరీజీని ఆక్రమించడమే కాకుండా, ఎప్పటికప్పుడు ర్యామ్‌ను ఉపయోగిస్తూనే ఉంటుంది.కొన్నిసార్లు మనం సాఫ్ట్‌వేర్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించి ఆతరువాత మరచిపోతాము.

అందుకే అనవసరమైన సాఫ్ట్‌వేర్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం ఉత్తమం.

Telugu Background Apps, Ret, Software, Fast-Latest News - Telugu

3.బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను జాగ్రత్తగా చూసుకోండిల్యాప్‌టాప్‌లలో కొన్ని ప్రోగ్రామ్‌లు వాటికవే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి.మీరు వాటిని ఆఫ్ చేయాలి.

ఇందుకోసం, Ctrl + Shift + Esc నొక్కడం ద్వారా టాస్క్ మేనేజర్‌కి వెళ్లి, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ అనవసర ప్రోగ్రామ్‌లు రన్ అవుతున్నాయో చెక్ చేయవచ్చు.మీరు క్లోజ్ చేయాలనుకుంటున్న ప్రోగ్రామ్‌పై ‘ఎండ్ టాస్క్‘ క్లిక్ చేయండి.

4.రీ స్టార్ట్ చేయండిమీ ల్యాప్‌టాప్‌ని రీ స్టార్ట్ చేయడం అనేది సాధారణ విషయంగా అనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

రీ స్టార్ట్ చేయడం వలన ల్యాప్‌టాప్ తాత్కాలిక కాష్ మెమరీని క్లియర్ చేయవచ్చు.దీనిని తాజాగా ప్రారంభించవచ్చు.అలాగే మీకు అప్‌డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడం మరచిపోవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube