పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు.సచివాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు.సీఎం ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేపడతామని మంత్రి అన్నారు.







