తాజాగా సోషల్ మీడియాలో ఒక మోస్ట్ ఎమోషనల్ వీడియో వైరల్ గా మారింది.గుడ్ న్యూస్ మూవ్ మెంట్ ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్, రెండు లక్షల వరకు లైకులు వచ్చాయి.“కుక్క, యజమాని 5 ఏళ్లు తర్వాత తిరిగి కలుసుకున్నారు.కుక్కని ఎవరో దొంగతనం చేయగా.
యజమాని తన కుక్కను మళ్లీ చూడలేనేమోనని అనుకుంది.కానీ చివరికి వీరిద్దరూ కలుసుకున్నారు.” అని ఈ వీడియోకి ఆ ఇన్ స్టాగ్రామ్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.
వైరల్ అవుతున్న వీడియోలో డాగ్ షెల్టర్ లో కుక్కలు ఉండటం గమనించవచ్చు.
అయితే ఈ షెల్టర్ వద్దకు చాలా ఎమోషనల్ గా ఒక మహిళ పరిగెత్తుకు రావడం కూడా మీరు గమనించవచ్చు.ఆ తర్వాత ఆమె డాగ్ షెల్టర్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఒక వ్యక్తి ఓ కుక్కని ఆమె వద్దకు తీసుకు వచ్చాడు.
దీంతో ఆమె మోకాళ్ళ పై కూర్చుని ఆ కుక్క ని కౌగిలించుకొని చాలా ఎమోషనల్ అయిపోయింది.ఎందుకంటే అది ఐదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన ఫేవరెట్ డాగ్.
ఐదేళ్ల తర్వాత తన ప్రియమైన ఓనర్ ని చూడగానే కుక్క కూడా పట్టరాని ఆనందంతో యజమాని పై గెంతులు వేసింది.యజమాని ముద్దులు పెడుతూ ఉండగా అది సంతోషంతో ఎగురుతూ యజమానిని కౌగిలించుకుంది.
ఈ దృశ్యాలను డాగ్ షెల్టర్ సిబ్బంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.చాలామంది తాము ఏడ్చేశామని కామెంట్లు చేస్తున్నారు.
మీరు కూడా ఈ మోస్ట్ ఎమోషనల్ వీడియోపై ఒక లుక్కేయండి.







