రాబోయే విపత్తుని సైతం ముందుగానే గుర్తించి దానికి తగ్గట్లుగానే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ.వాటిని అమలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్.
ఏపీ మంత్రిమండలిలో తాజాగా జగన్ మార్పుచేర్పులు చేపట్టారు.ఎప్పటి నుంచో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఎంతోమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.ఆ అసంతృప్తి నేతల అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
పార్టీ మారుతానంటూ హడావుడి చేశారు.చివరకు వైసిపి కీలక నేతల బుజ్జగింపులు తో వారంతా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఎక్కడా ఎవరికి ఎటువంటి అసంతృప్తి లేదు.కేవలం వైసీపీ కీలక నేతల బుజ్జగింపులతోనూ, జగన్ హామీలతోనూ వారు నిర్ణయాన్ని మార్చుకున్నారు అనే చెప్పాలి.వారు వేరే పార్టీలోకి వెళ్లే ఆప్షన్ లేకపోవడం , వెళ్ళినా, అక్కడ తగిన ప్రాధాన్యత, అవకాశం లేకపోవడం ఇవన్నీ కారణాలే.వైసీపీలో ప్రస్తుతం అసంతృప్తికి గురై ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు కొంతమంది ప్రయత్నించినా, అటు నుంచి సంకేతాలు రాకపోవడానికి కారణం సదరు నేతలకు టిడిపి తదితర పార్టీల నుంచి ఆ స్థాయిలో ఆహ్వానాలు రాకపోవడమే కారణం.

జగన్ మెప్పు పొందేందుకు చాలామంది నాయకులు టిడిపి , జనసేన బీజేపీ వంటి పార్టీలను విమర్శించే విషయంలో దూకుడు గానే వ్యవహరించారు.వ్యక్తిగతంగానూ ఆయా పార్టీల నేతలపై విమర్శలు చేశారు.ఈ క్రమంలో అసంతృప్త నేతలకు వైసీపీలో కొనసాగడం మినహా మరో ఆప్షన్ కనిపించకపోవడంతోనే ఈ విధంగా అసంతృప్తి కి గురైన వెంటనే సర్ధుమనిగిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అలాగే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు, మంత్రి పదవులు కోల్పోయిన వారిలో కీలక మైన వారికి జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తామనే హామీ ఇవ్వడం తోనే నాయకుల అసంతృప్తి మొత్తం టీ కప్పులో తుఫాను గా మారిపోయింది.







