నిరుద్యోగులకు పని అయినా చూపండి లేదా నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండి అని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రం లోని గజ్జల వెంకటయ్య భవనంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు దాసరి మహేందర్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని షేక్ బషీరుద్దీన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో, రాష్ట్రంలో చదువుకొని అన్ని అర్హతలు ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించ లేక పోతున్నారని, ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదని, ఉన్న ఉద్యోగాలు విడదీస్తున్నారని ఆయన అన్నారు.అందుకే దేశంలో నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుందని, ప్రపంచం లో ఎక్కడా లేని యువ సంపద భారతదేశం లో ఉందని కానీ అందరికీ పని చూపించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, అందుకే ఈ దేశం కూడా అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చేతగాని ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎన్నికల సందర్భంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన చేస్తున్నారని కనీసం అవసరమైన అన్ని అర్హతలు ఉన్న నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ ఆందోళనలో యూత్ అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ జనరల్ బాడీ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు కొమ్ము శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అంగిరేకుల నరసయ్య, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దిండు మంగపతి, మండల నాయకులు మాచర్ల రాజశేఖర్, బెజ్జబోయిన పవన్, రాసాల సాయి, కొమ్ము రాజేష్, దాసరి రాంబాబు, కొమ్ము గోపి, దాసరి శోభన్, అంగిరేకుల శ్రీహరి, గజ్జల అశోక్, నేతకాని రామకృష్ణ, వి రవి, భాజపాపై సాయి తదితరులు పాల్గొన్నారు.







