టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రేంజ్ పెరిగింది.బాషతో సంబంధం లేకుండా హద్దులు అన్నిటిని కూడా తెలుగు చిత్ర పరిశ్రమ చెరిపేసింది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తెరకెక్కిస్తున్న సినిమాలకు అటు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో ఇదే క్రేజ్ ని బాగా క్యాష్ చేసుకుంటున్న స్టార్ హీరో లు ప్యాకేజీని బట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు అనేది తెలుస్తుంది.
ఇలా కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు డైరెక్టర్లు కూడా ప్యాకేజీ దందా లోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారట.ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ప్యాకేజీ ట్రెండ్ నడుస్తుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.
వర్మ ఒక వివాదాస్పద సినిమాని తెరకెక్కించాడు అందరికీ గుర్తుండే ఉంటుంది.అదేనండి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇక ఈ సినిమాకు వర్మ ప్యాకేజీ ఏకంగా 13 కోట్ల వరకూ ఉండటం గమనార్హం.
ఆ తర్వాత రూపొందిన చిత్రాలకు కూడా వర్మ ఇదే పంథాను అనుసరిస్తూ కోట్ల ప్యాకేజీ అందుకుంటున్నాడు అన్న టాక్ ఉంది.ప్యాకేజీ లో 15 శాతం డబ్బులతో మాత్రమే సినిమాలు నిర్మిస్తూ రిలీజ్ కు ముందే కోట్లు సంపాదిస్తున్నాడు.
ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడి గా మారిపోయిన రాజమౌళి సైతం ఇది ప్యాకేజీ ఫాలో అవుతుండటం గమనార్హం.స్టోరీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తే డైరెక్షన్ బాధితుల్ని తనయుడు కార్తికేయ చూసుకుంటాడు.

ఇక రాజమౌళి అన్న కీరవాణి సంగీతం అందిస్తే.వారి సతీమణి శ్రీవల్లి ఇక సినిమా పనులు చూసుకుంటుంది.ఇలా రాజమౌళి ఫ్యామిలీ ప్యాకేజ్ భారీగానే అనుకుంటున్నాడట.దీంతో పాటు ఇక లాభాల్లో కూడా వాటా అడుగుతున్నారట జక్కన్న.ఇక ఇలా బాహుబలి సినిమా కోసం 50 కోట్ల వరకూ ప్యాకేజీ అనుకున్నాడట రాజమౌళి.త్రిబుల్ ఆర్ సినిమాకి 80 కోట్లు పారితోషికంతో పాటు 30% లాభాల్లో వాటా కూడా డిమాండ్ చేసినట్లు టాక్.
దర్శకుడు మారుతీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడట.పారితోషకం తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు.

బన్నీ కూడా పుష్ప సినిమాతో ప్యాకేజీ ఫార్మాట్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 50 కోట్లతో ప్యాకేజ్ డిమాండ్ చేస్తున్నారట.మహేష్ బాబు తన జి.ఎన్.బి సినిమాస్ కూడా కలుపుతూ వాటా అందుకుంటూ ఉండటం గమనార్హం.శ్రీమంతుడు సినిమాతో ఈ ప్యాకేజీ ఫార్ములా లోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు.
యువహీరో కిరణ్ అబ్బవరం సైతం ప్యాకేజీ ఫార్ములాలోనే సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.