ప్రేమించి పెళ్లి చేసుకుంటే కాపురం ఇలా ఉంటుందా..?

ప్రేమ గుడ్డిది అంటారు సామాన్యులు.అసలు ప్రేమకు అర్ధం తెలిసిన వాళ్లు ఎవరు అలా మాట్లాడారు.

 Keira And George Keywood Married Life , Keira , George Keywood, Marrege , Love-TeluguStop.com

ఎందుకంటే ప్రేమించుకుని ఒకరిని ఒకరు అర్ధం జీవితాతం కలిసి జీవనం కొనసాగిస్తారు.చాలా హ్యపీగా ఎంజాయ్ చేసుకుంటు కాలం గడిపేస్తారు.

ఇప్పుడు ఉన్న రోజుల్లో నాకు తెలిసి ప్రేమ పెళ్లి బెటర్ అనిపిస్తుంది.ఎందుకంటే నాకు కీరా, జార్జ్ కీవుడ్‌ కథ విన్నా తరువాత ప్రేమ చాలా గోప్పది అని అనిపంచింది.

పేరు సియన్నా కీరా.వయసు 27 ఏళ్లు.ఆస్ట్రేలియాకి చెందిన ఆమె ఓ ఆర్టిస్ట్.తనలాంటి మరో ఆర్టిస్టు బ్రిటన్‌కి చెందిన జార్జ్ కీవుడ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీళ్లకు ఓ బాబు కూడా.తమ గురించి ఈ జంటకు ఏ సమస్యా లేదు.

వాళ్ల కాపురంలో ఏ కలతలూ లేవు.తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని ఆమె చెబుతోంది.

కానీ ట్రోలర్లు భరించలేకపోతున్నారు.అలా ఎలా ఉంటారని ట్రోల్స్ చేస్తున్నారు.

ట్రోలర్ల బాధ ఏంటంటే ఆమె చాలా అందంగా ఉందట.అంత అందమైన అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కోటి మంది క్యూ కడతారు.అలాంటి ఆమె తన కంటే రెట్టింపు సైజులో లావుగా ఉన్న వ్యక్తిని ఎలా ప్రేమించింది, ఎలా పెళ్లి చేసుకుంది అని ప్రశ్నిస్తున్నారు. సిడ్నీలో ఉండే సియన్నాపెళ్లి తర్వాత లండన్ వెళ్లిపోయింది.

అక్కడ హబ్బీతో హాయిగా ఉంది.మా ప్రేమ కథకు పెళ్లితో శుభం కార్డు పడింది.

ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం కదా మరెందుకు ఫీల్ అవుతున్నారని ఆమె ట్రోలర్లను ప్రశ్నిస్తోంది.ట్రోలర్లు డిటెక్టివ్‌ల లాగా మారిపోయారు.

ఆమెదీ, జార్జిదీ సోషల్ మీడియాలోని అకౌంట్లన్నీ చెక్ చేశారు.చివరకు ఓ కంక్లూజన్‌కి వచ్చారు.

జార్జి బాగా డబ్బున్నవాడనీ.అందుకే అతన్ని పెళ్లి చేసుకుందని అన్నారు.ఈ ట్రోలింగ్ ఆ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగిస్తోంది.2018లో ఓ కామెడీ షోలో సియన్నాకీ, జార్జికీ పరిచయం ఏర్పడింది. ఆ షోలో జార్జి కూడా నటించాడు.అలా ఇద్దరూ తొలిసారి కలిశారు.అతను లావుగా ఉన్నాకళ్లు అందంగా ఉన్నాయని సియన్నా మెచ్చుకుంది.

Telugu Australia, Show, George Keywood, Keira, Love, Love Marrege, Marrege, Sydn

జార్జిని తానే మొదట ప్రేమించానని సియన్నా తెలిపింది.జార్జితో పరిచయం తర్వాత అతని ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 3సార్లు మెసేజ్ పంపగా… మెల్లగా ?అతను కూడా చాట్ స్టార్ట్ చేశాడు.అలా వాళ్ల పరిచయం ప్రేమకు దారితీసిందట.

ఆ తర్వాత ఓసారి లండన్ వెళ్లి అతన్ని కలిసింది.ఇప్పుడు వాళ్లకు రెండేళ్ల కొడుకు ఒలివెర్ ఉన్నాడు.

మిర్రర్ ప్రకారం.ఈ జంట.తమ ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది.అక్కడ ట్రోల్ మొదలైంది.

ఆమెది పబ్లిసిటీ స్టంట్ అని వాదిస్తున్న ట్రోలర్లు అంత అందమైన అమ్మాయి అంత లావుగా ఉన్నవాడితో ప్రేమలో పడదు అని వాళ్లకు వాళ్లు ఫిక్స్ అయిపోయారు.ఒకట్రెండు రోజుల టూర్ కోసం లండన్ వెళ్లిన సియన్నాతో ఆరు వారాలపాటూ యూరప్ టూర్ వేశాడు జార్జి.

అలా ఇద్దరూ డేటింగ్ చేసుకున్నారు.ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నారు.

తర్వాత ఆమె తిరిగి ఆస్ట్రేలియా వచ్చేసింది.సిడ్నీ వచ్చిన సియన్నా.

అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయింది.జార్జిని విడిచి ఉండలేను అనుకుంది.

తిరిగి లండన్ వెళ్లిపోయింది.మనం పెళ్లి చేసుకుందామా అని జార్జి ఆమెకు ప్రపోజ్ చేశాడు.

తన ప్రేమ విషయాన్ని పేరెంట్స్‌కి చెప్పింది.మొదట ఆశ్చర్యపోయిన పేరెంట్స్ తర్వాత వాళ్లిద్దరూ సంతోషంగా ఉండటం చూసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దాంతో యూకే వీసా పొందిన సియన్నా అక్కడ జార్జిని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటోంది.ఈ కథంతా ట్రోలర్లకు తెలుసు.

కానీ ఇదే కథను వాళ్లు మరోలా చెబుతున్నారు.డబ్బున్న జార్జితో సియన్నా కామెడీ షోలో చేసినప్పుడు… అతను భారీగా డబ్బు ఖర్చు పెట్టడం చూసింది.

అతని లావిష్ లైఫ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయింది.దాంతో అతనితో ఇన్‌స్టాలో చాటింగ్ ప్రారంభించింది.

ఇష్టం లేకపోయినా జార్జి కనెక్ట్ అయ్యాడు.తర్వాత యూరప్ వెళ్లి తన అంద చందాలతో అతన్ని ఎట్రాక్ట్ చేసిన సియన్నా అతనితో భారీ టూర్ ప్లాన్ చేసింది.బాగా ఖర్చు పెట్టించింది.అలా బుట్టలో పడేసుకొని పెళ్లి చేసుకుంది అని ట్రోలర్లు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube