మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్కే రోజా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కుటుంబసమేతంగా సీఎం జగన్ కలిసి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు రోజా కృతజ్నతలు తెలిపారు.అనంతరం సచివాలయంలో పర్యటన, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.
రాష్ట్రంలో విశాలమైన తీరరేఖ ఉందని… టూరిజానికి చాలా స్కోప్ ఉందన్నారు.గండికోట టూ బెంగళూర్, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీస్‌ను ప్రారంభిస్తూ తొలిసంతకం చేసినట్టు ఆమె తెలిపారు.
తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని.కరోనా కారణంగా క్రీడలకు దూరంగా ఉన్నారని.
అలాంటి వారిని తిరిగి క్రీడల వైపు మళ్లిస్తామన్నారు.
పార్టీ పెట్టక ముందు నుంచే జగన్ అడుగు జాడల్లో నడిచినట్టు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.
మంత్రులుగా ఉన్న వాళ్లందరం జగన్ సైనికుల్లా పని చేస్తామన్నారు.మంత్రి వర్గంలో ఈక్వేషన్స్ బేస్ చేసుకొని కేటాయింపులు చేశారన్నారు.జగన్ లాంటి నేతతో కలిసి నడవడం తమ అదృష్టమన్నారు.జగన్ పాలన చూసి అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని రోజా పేర్కొన్నారు.
పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు.
రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామన్నారు.సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తామన్నారు.
దేశ విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో రూపొందిస్తామని రోజా పేర్కొన్నారు.గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.క్రీడాకారులకు వసతులు కల్పిస్తామన్నారు.
ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు తమకు తెలుసన్నారు.కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని రోజా తెలిపారు.







