పవన్ కళ్యాణ్ ఫోకస్ మార్చారా.? ఇప్పటి వరకు సినిమాలను, రాజకీయాలను లేవల్ చేస్తున్న ఆయన.ఇకపై సీరియస్ గా రాజకీయాలని డిసైడ్ అయ్యారా? ఎందుకంటే ఏపీ ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది.మరోవైపు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అవ్వాలని జనసేన అధినేత పవన్ డిసైడ్ అయ్యారు.ఇందులో భాగంగా గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫాలో అయిన.
ఫార్ములానే పవన్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా.? ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో జనసేన ఓట్ల శాతం బాగానే పెరిగే అవకాశం ఉంటుంది.
గత ఎన్నికల్లో ఓడిపోయరనే సానుభూతి.ప్రభుత్వ వ్యతిరేక ఓటు.గ్రౌండ్ లెవ్ లో జనసేనకు మద్దతు పెరుగుతుండడంతో ఇవన్నీ పవన్ కు కలిసివచ్చే అంశాలే కానీ.గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయి ఓటు బ్యాంకు లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే వాటిపై ఫోకస్ పెడుతున్నారు.ఇందులో భాగంగా ఓ భారీ యాత్రకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఉంది.
ప్రజల్లో నిరంతరం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఒక పక్క సినిమా షెడ్యూల్ ను మేనేజ్ చేసుకుంటూ.
మరోపక్క రాజకీయాలకు అధిక సమయం ఉండేలా బ్యాలెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ వచ్చే ఎన్నికలకు పొత్తుతోనే వెళ్తున్నారన్నది క్లారిటీ వచ్చేసింది.ఇప్పటికిప్పుడు అంటే ఆయన బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు.కానీ క్షేత్ర స్థాయిలో.
అంటే జనసైనికుల నుంచి.వస్తున్న డిమాండ్ మాత్రం.
బీజేపీతో వెళ్లడం కన్నా.టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని ఫీడ్ బ్యాక్ వచ్చినట్టు తెలుస్తోంది.
పవన్‌కు డీపీతో కలిసి వెళ్లాలి అని ఉన్నా.
అందుకు బీజేపీ ప్రస్తుతానికి అయితే సిద్ధంగా లేదు.తాము కేవలం పవన్ తో కలిసి మాత్రమే పోటీ చేస్తామని.
ఒకవేళ పవన్ టీడీపీతో కచ్చితంగా వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే.ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధమంటూ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
మరి పవన్ ఎవరి పొత్తుతో ముందుకు వెళ్తారన్నదానిపై ఒకటి రెండు నెలల్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.మొదట బీజేపీని ఒప్పించి.
మూడు పార్టీల కూటమితో బరిలో దిగడానికే పవన్ ప్రయత్నిస్తున్నారని.బీజేపీ అందుకు ససేమిరా అంటే.
అప్పుడే నిర్ణయం తీసుకుందామని ధోరణిలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.

పొత్తుల సంగతి ఎలా ఉన్నా గ్రామీణ ఓటర్లలో నమ్మకం కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నది జనసేన ఆలోచన.గత ఎన్నికలతో పోలిస్తే బలం పెరగిందని లెక్కలు వేసుకుంటున్నారు.ఇందులో భాగంగా జనసేన అధినేత.
రైతులపై ఫోకస్ చేస్తున్నారు.రైతు చైతన్య యాత్ర నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.
రైతు కుటుంబాలను నేరుగా ఆయన పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.గతంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్ర తరహాలోనే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను నేరుగా కలుసుకుని, వారిని ఓదార్చారు.

ఏపీలో ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను జనసేన పార్టీ నాయకులు దృష్టికి తీసుకువెళ్లారు.పంట నష్టాలతో రైతులు, కౌలు రైతులు, ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం అంటూ ఇటీవల పవన్ వ్యాఖ్యానించారు.ఇటీవల కాలంలో గోదావరి జిల్లాల్లో 73 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జనసేన చెబుతోంది.వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన ప్రకటించింది.
వాటిని నేరుగా పవన్ కళ్యాణ్ వారి ఇంటికి వెళ్లి అందించిన పవన్ రాజకీయంగాను కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారట.అందుకే జగన్ ఓదార్పు యాత్ర తరహాలోనే ఈ యాత్రను నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నారట పవన్ కళ్యాణ్.







