కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం గని.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని అల్లు బాబీ,సిద్ధ,ముద్ద నిర్మించారు.
ఈ సినిమా కోసం మెగా హీరో మూడు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి పని చేశారు.అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో ఈ సినిమా ఫలితం పై హీరో వరుణ్ తేజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సోషల్ మీడియా ద్వారా స్పందించిన వరుణ్ ఇన్ని సంవత్సరాలు పాటు నా పై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.అలాగే ఈ చిత్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశారు.ముఖ్యంగా నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.
అందరం ఎంతో కష్టపడి పనిచేసి ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలని ఎంతో కష్టపడి పని చేసామని వరుణ్ తేజ్ వెల్లడించారు.

ఇక నేను ఏ సినిమాలో నటించినా తప్పకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలన్న తపనతోనే సినిమా కోసం కష్టపడి పని చేస్తానని,అయితే ఎన్నో సార్లు ఆ విషయంలో తాను విజయం సాధించానని ఏదో కొన్ని సార్లు మాత్రమే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయని, అయితే వీటి నుంచి సరికొత్త పాఠాలను నేర్చుకుంటానని వెల్లడించారు.అయితే నేను అందుకున్న ఫలితాలు నా సినిమా కోసం కష్టపడే విషయంలో ఎలాంటి మార్పులు తీసుకురావని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.







