ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదేనా.. మందు తాగుతూ కథలు రాస్తానంటూ?

దేశం గర్వించదగ్గ టాలెంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు.కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాతో దేశంలోని సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

 Director Prashant Neel Success Secret Details Here Goes Viral , Prashant Neel-TeluguStop.com

కేజీఎఫ్ ఛాప్టర్1 ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల కాగా కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాపై మాత్రం ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు అంచనాలకు మించి ఉండబోతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే మందు తాగుతూనే తాను సినిమా కథలను రాస్తానంటూ ప్రశాంత్ నీల్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.తాను మద్యం సేవిస్తానని మద్యం తాగే సమయంలో మాత్రమే కథలను రాస్తానని ప్రశాంత్ నీల్ అన్నారు.

తాను మద్యం తాగి మత్తులో ఉన్న సమయంలో కూడా సినిమాకు ఆ సీన్ అవసరమా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకుంటానని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.అయితే దానిని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యమైన టాస్క్ అని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు.

Telugu Allu Arjun, Jr Ntr, Kgf Chapter, Kgf, Prabhas, Prashant Neel, Ram Charan-

ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఒక సినిమాను, జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు.జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ కూడా పూర్తైందని తారక్ కు కథ ఎంతగానో నచ్చిందని ప్రచారం జరుగుతోంది.ప్రశాంత్ నీల్ తారక్ కాంబో మూవీ సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చూడాల్సి ఉంది.

చరణ్, బన్నీలతో ప్రశాంత్ నీల్ సినిమాలను తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నా ఇప్పట్లో ఈ కాంబినేషన్ లో సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.కేజీఎఫ్ ఛాప్టర్2 రిజల్ట్ ను బట్టి ప్రశాంత్ నీల్ భవిష్యత్తు సినిమాల బడ్జెట్ డిసైడ్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube