కళ్యాణ్ కృష్ణ సమర్పణలో నిర్మాత జికె మోహన్ కాన్సెప్ట్ ఫిల్మ్ కి 'లంబసింగి' టైటిల్ ఖరారు

వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్న కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత జీకే మోహన్ ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు.సరికొత్త కంటెంట్ చిత్రాలని రూపొందించే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న కాన్సెప్ట్ ఫిల్మ్ తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌ను ప్రకటించింది.

 Kalyan Krishna Presents, Producer Gk Mohan Of Concept Film’s Movie Titled Lamb-TeluguStop.com

నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి కథానాయికగా కనిపించనుంది.

ప్రతిభ గల కొత్త నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు.

ఈ చిత్రంతో భరత్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రానికి లంబసింగి అనే టైటిల్‌ ను ఖరారు చేశారు.

ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక.ఆర్ఆర్ దృవన్ సంగీతం అదించిన ఈ చిత్రం నుండి మొదటి పాట ”నచ్చేసిందే నచ్చేసిందే”ని ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.

ఈ రోజు పాటకు సంబధించిన ప్రోమోను విడుదల చేశారు.మెస్మరైజ్ చేస్తున్న ఈ రొమాంటిక్ మెలోడీని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు.

ఈ ప్రోమో పూర్తి పాట కోసం ఎదురుచూసేలా ఆసక్తిని పెంచింది.హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

కె బుజ్జి సినిమాటోగ్రాఫర్ గా, కె విజయ్ వర్ధన్ ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

తారాగణం: భరత్, దివి, సాంకేతిక విభాగం : కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: నవీన్ గాంధీ నిర్మాత: జికె మోహన్ సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల, బ్యానర్: కాన్సెప్ట్ ఫిల్మ్స్, డివోపీ : కె బుజ్జి, సంగీతం: ఆర్ఆర్ దృవన్, ఎడిటర్: కె విజయ్ వర్ధన్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube