అఫిషియల్ : షూట్ కంప్లీట్.. అనుకున్న సమయానికే రాబోతుందట!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటసినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగాకీర్తి సురేష్ నటిస్తుంది.

 Sarkaru Vaari Paata Completes Shooting, Sarkaru Vaari Paata, Mahesh Babu , Shoo-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 12న విడుదల కాబోతుంది.

అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా వాయిదా పడుతుంది అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు మేకర్స్.అతి త్వరలోనే మహెహ్ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యిందని.

షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయ బోతున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం పూర్తి అయ్యింది.

ఈ ఒక్క పాట కూడా త్వరలోనే షూట్ జరిపి అనుకున్న సమయానికే రిలీజ్ చేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని టెన్షన్ పడ్డారు.కానీ ఇప్పుడు క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తునట్టు ఇప్పటికే ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో రిపీట్ అవుతుంది.అందుకే ఈ హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

సర్కారు రిలీజ్ అవగానే కాస్త బ్రేక్ తీసుకుని ఈ సినిమాలో మహేష్ జాయిన్ అవ్వనున్నాడు.

https://twitter.com/MythriOfficial/status/1513828066027786243?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1513828066027786243%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fmahesh-babu-sarkaru-vaari-paata-movie-shoot-completed%2F
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube