ఓ గుత్తేదారినీ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి ఫారెస్ట్ రేంజ్ అధికారి జ్యోత్స్నదేవిని సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ చీప్ కన్జర్వేటర్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ డోబ్రియల్ ఈరోజు ఉత్తర్వులు విడుదల చేశారు.ఇదే వ్యవహారం లో గత మూడు రోజుల క్రితం నేలకొండపల్లి బీట్ అధికారి,సెక్షన్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.
తాజాగా ఫారెస్ట్ రేంజ్ అధికారి జ్యోత్స్నదేవి కూడా సస్పెన్షన్ కి గురికావడంతో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
కోదాడ-ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై కూసుమంచి అటవీ రేంజ్ పరిధిలోని నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో చెట్ల నరికి వేతకు సంబంధించి బానోత్ ప్రమీల అనే గుత్తేదారు కాంట్రాక్టును దక్కించుకుంది.
అయితే నరికివేత,తరలింపు అనుమతులు విషయంలో ఎఫ్ఆర్ఓ జ్యోత్స్నదేవి, గుత్తేదారు ప్రమీలను డబ్బులు డిమాండ్ చేశారని ప్రమీల ఉన్నతాధి కారులకు పిర్యాదు చేసారు.ప్రతి లోడుకు కూడా కొంత నగదు ముట్టజెప్పాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు గుత్తేదారు, చీఫ్ కన్జర్వేటర్ కు ఫిర్యాదు చేశారు.
అలాగే రూరల్ మండలం తల్లంపాడు వద్ద సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు చెట్లును నరకాల్సిందిగా అధికారులు ప్రమీలను సంప్రదించారు.దీనితో ప్రమీల తన కూలీలను పంపగా ఫారెస్ట్ అధికారులు అక్కడ కూడా డబ్బు డిమాండ్ చేసి కులం పేరుతో దూషించిందని 25న ఫిబ్రవరిన ప్రమీల ఫిర్యాదులో పేర్కొన్నారు.
తల్లంపాడు ఘటనతో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు మార్చి 5న విచారణ ప్రారంభించి నిర్దారణ అనంతరం ఒక్కొకరిపై సస్పెన్షన్ వేస్తూ వస్తున్నారు.







