మైండ్ బ్లాక్ అయ్యే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

ఆనంద్ మహీంద్రా పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు.ప్రముఖ వ్యాపారవెత్తగా మాత్రమే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.

 Anand Mahindra Shared The Video , Anandh Mahindra , Social Media , Motivation P-TeluguStop.com

సోషల్ మీడియాలో ఎదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉంటారు.టాలెంట్ ఎక్కడ కనిపించినా గాని వారిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ముందుంటారు ఆనంద్ మహీంద్రా.

ఆయన పెట్టే పోస్ట్ లు ఎంతోమందికి ఎన్నో రకాల సందేశాలను ఇస్తూ అందరిని ఆలోచింపజేసేవిలాగా ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరొక వీడియోను షేర్ చేసారు.

ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసే మండే మోటివేషన్ పోస్టుల్లో భాగంగా సోమవారం రోజున విలువ కట్టలేని ఓ సందేశాన్ని ఆయన పోస్ట్ చేసారు.

ఆ పోస్ట్ లో భాగంగా “ఒక్కోసారి సోమవారం ఉదయం అత్యంత ప్రమాదకరంగా అనిపించవచ్చు.కానీ మీరు వారమంతా గడిచేలా చెయ్యగలగాలి.ప్రమాదంలో పడి లోయలోకి జారిపోకుండా ఉండాలి అనే క్యాప్షన్ పెట్టి అయ ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవతున్నారు.

ఇంతకీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఆ వీడియో ప్రకారం ఉత్తరాఖండ్‌లోని జోహార్ లోయ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశంలో చాలా సన్నగా ఉండే ఘాట్ రోడ్డుపై ఓ ట్రక్ లాంటి వాహనం వెళ్లడం మనం వీడియోలో చూడవచ్చు.

ట్రక్ లో చాలా మంది ప్రయాణికులు మిలామ్ నుంచి జోహార్ లోయకు వెళ్తున్నారు.ఆ రోడ్డు చూడడానికి ఎంతో భయంకరంగా ఉంది.కాస్త తేడా వచ్చినాగాని వాహనంతో సహా ట్రక్ లో ప్రయాణం చేసే వారందరు లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి.

అన్నీ తెలిసి కూడా డ్రైవర్ మీద నమ్మకంతో వారు తమ ప్రయాణం అలాగే సాగించారు.నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు.ఈ వీడియో 2020లోనే వైరల్ అయింది.మళ్ళీ ఇప్పుడు ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో మళ్ళీ ఇప్పుడు అందరి దృష్టిలో పడింది.

ఈ వైరల్ వీడియో చూసి నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube