ఏప్రిల్ 16 వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ఖమ్మంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, ఖమ్మం నగరంలో అభివృద్ధి, సంక్షేమం, సుందరికారణ లో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకుగాను నూతనంగా నిర్మించిన పలు భవనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించటంతో పాటు పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.అనంతరం లకారం ట్యాంక్ బండ్ నందు సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వివరాలు 16 న ఉదయం 9.00 హైదరాబాద్ నుండి హెలిక్యాప్టర్ లో బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు.10:15 గంటలకు రఘునాథపాలెం మండల కేంద్రంలో సుడా పల్లె బృహత్ ప్రకృతి వనం పార్క్ నీ ప్రారంభిస్తారు.10:45 గంటలకు ఖమ్మం టేకులపల్లి లో నిర్మించిన రెండు వందల నలభై డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు.11:15 గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫూట్ పాత్ ను ప్రారంభిస్తారు.11:45 కు గట్టయ్య సెంటర్ లో నిర్మించిన నూతన మున్సిపల్ భవనం తో పాటు, చెత్త సేకరణ నిమిత్తం మున్సిపల్ కార్యాలయంకు మంజూరైన ట్రాక్టర్లు, ఆటోలను ప్రారంభిస్తారు.ఒంటి గంటకు భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2:30 కి దానవాయిగూడెంలోని చెత్త శుద్ధి కర్మాగారం ను ప్రారంభిస్తారు.3:00 గంటలకు ప్రకాష్ నగర్ లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామంను ప్రారంభిస్తారు.3:30 గంటలకు శ్రీనివాస్ నగర్ లో ఎస్టీపి ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.సాయంత్రం 4 గంటలకు లాకారం ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసిన తీగెల వంతెన తో పాటు మ్యూజికల్ లైట్, లెడ్ లైటింగ్ ను ప్రారంభిస్తారు.యంపీ ధియేటర్ నిర్మాణానికి కు శంకుస్ధాపన చేస్తారు.
అనంతరం లాకారం ట్యాంక్ బండ్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు.సాయంత్రం అరుగంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు.







