తెలంగాణలో వడ్ల రాజకీయం రోజురోజుకు కొత్తమలుపు తిరుగుతుంది.కేంద్రంపై గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఎకంగా బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనకు దిగింది.
నిజామాబాద్ ఎంపి అరవింద్ ఇంటి ముందు వడ్లను కుప్పలుగా పోసి మరో కొత్త నటకానికి తెర తిశారు.
రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దీక్ష చేపట్టి 24 గంటలు గడవకముందే బీజేపీ నేతల ఇళ్లపై దాడులు మొదలైయ్యాయి.
ఇప్పటివరకు విమర్శలకే పరిమితమైయిన టీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా నిరసనల పేరుతో దాడులకు బరితేగిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ నిరసనలను రైతుల ముసుగులో టీఆర్ఎస్ నేతలు ఆడుతున్న డ్రామా అని బీజేపీ నేతలు కొట్టిపారేశారు.
ఆర్మూర్‌లోని పెర్కిట్ లో ఎంపి దర్మపురి అరవింద్ ఇంటి ముందు జరిగిని నిరసని తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారు.ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలను, టీఆర్ఎస్ రైతు విభాగం నాయకులను రెచ్చగొట్టి ఇలాంటి పనులను చేస్తున్నాడని బీజేపీ నేతలు మండిపడ్డాయి.

యాసంగి వడ్లను కేంద్రాన్ని కొనమంటే కొనదు.అలాగని రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా ఉండలేదు.ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తే.అది టీఆర్ఎస్ పై ప్రభావం చూపిస్తుంది.అందుకే ప్రత్యామ్నాయ చర్యలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు.ఓవైపు దీనిపై న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడ్డారు.
మరోవైపు క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలు ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.
కిందటి సీజన్ లోనూ వడ్ల కొనుగోలు అంశం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.
ఇప్పుడూ అదే సమస్య ఎదురైంది.అందుకే వడ్ల కొనుగులు సమస్యగా మారకుండా.
వర్షాకాలం పంటలపై ఏం చేయాలన్నది మంత్రిమండలి చర్చిస్తుంది.దీంతోపాటు ధాన్యం కొనుగోళ్లలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలంటూ ఎలుగెత్తనుంది.
దీనిపై జాతీయస్థాయిలో రైతు సంఘాలు, ఆహార నిపుణులు, వివిధ పార్టీలను ఆహ్వానించి ఢిల్లీలోనే సదస్సు ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ సీజన్ లో ఎలా లేదన్నా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.అయితే ప్రభుత్వమే ధాన్యాన్ని కొని బహిరంగంగా వేలం వేయడమా.లేదా గత పద్దతిని అనుసరించడమా అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి.
మొత్తానికి వడ్ల కొనుగోలు అంశం క్లైమాక్స్ కు చేరింది.ఇప్పుడు బీజేపీకి షాక్ ఇచ్చేలా కేసీఆర్ నిర్ణయం ఉంటుందంటున్నారు.
రిజల్ట్ ఎలా ఉన్నా రైతు నష్టపోకుండా ఉంటే చాలు.







