ప్రస్తుతం బాలీవుడ్లో రణబీర్ కపూర్ ,ఆలియా భట్ వివాహం గురించి చర్చలు జరుగుతున్నాయి.గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈనెల 14వ తేదీన వివాహబంధంతో ఒకటి కానున్నారు.
కాగా వీరి పెళ్లికి సంబంధించి ప్రస్తుతం బీ టౌన్ లో చర్చలు నడుస్తున్నాయి.ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆలియా భట్ ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి ఎక్కడ జరుగుతుంది.ఎంతమంది హాజరవుతున్నారనే విషయాల గురించి చర్చ జరుగుతోంది.ఈనెల 14వ తేదీన రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే పెళ్లి పనులు మొదలు పెడతామని చెప్పుకొచ్చాడు. చెంబూర్ లోని ఆర్కే హౌస్ లో రిషికపూర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుకానున్నాయి సమాచారం.

రిషి కపూర్ 2020లో మరణించిన సమయంలోనే ఆలియా కపూర్ ఫ్యామిలీ కి దగ్గర అయింది.ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ మాట్లాడుతూ తన తండ్రి గొప్పతనం గురించి వివరించాడు.తన కుటుంబ సభ్యులు తన తండ్రిని ఎంతో మిస్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు.తన తండ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడతామని ఈ సందర్భంగా రణబీర్ కపూర్ వెల్లడించాడు.
అయితే వివాహం అనంతరం ముంబైలోని తాజ్ కొలాబాలో రణబీర్ కపూర్ ఆలియా రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఈ రిసెప్షన్ కు అలియా, రణబీర్ కపూర్ ల స్నేహితులు హాజరుకానున్నారు.
పెళ్లి వేడుక కోసం ముస్తాబైన ఆర్కే హౌస్ చుట్టూ ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.







