తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కొరకై చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి పాదయాత్రను పునర్ ప్రారంభించారు ప్రారంభానికి ముందు సాయిబాబా,నవదుర్గాదేవి ఆలయాల్లో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.దైవ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈరోజు బోనకల్ మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి బోనకల్ రైల్వే బ్రిడ్జి మీదుగా రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాలో పాదయాత్ర కొనసాగుతుంది.అదే రోజు రాత్రి రామాపురంలోని బస చేస్తారు.
ఈ నెల 12న మంగళవారం రోజున గార్లపాడు నుంచి లక్ష్మీపురం, గోవిందాపురం, పెద్ద బీరవల్లి, జానకిపురం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.అదే రోజు రాత్రి జానకిపురం లో ఫంక్షన్ హాల్ లో బస చేస్తారు.13న బుధవారం రోజున జానకిపురం నుంచి నారాయణపురం, చిన్న బీరవల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.అదే రోజు రాత్రి కలకోట గ్రామం లో పైడి కిషోర్ ఇంట్లో బస చేస్తారు.14న గురువారం రోజున కలకోట నుండి రాయనపేట, ఆల్లపాడు, గోవిందపురం, మోటమర్రి గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.అదే రోజు రాత్రి మోటమర్రి గ్రామంలోని వాటర్ ట్యాంక్ ప్రదేశం వద్ద బస చేస్తారు.







