బ్రిటన్ రాణిని బీట్ చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె...!!!

బ్రిటన్ ఆర్ధిక మంత్రి ఎవరో మీకు తెలుసా అంటే పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు.ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు ఎవరో తెలుసా అంటే రిషి సునక్ అని చటుక్కున చెప్పేస్తారు.

 Infosys Narayanamurthy's Daughter Who Beat Britain's Queen , Britain, Rishi Suna-TeluguStop.com

ప్రస్తుతం బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా ఉన్న రిషి సునక్ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా రాబోయే కాలంలో బ్రిటన్ ప్రధానిగా కూడా రిషి సునక్ ను చూడబోతున్నామని నిపుణులు అంటున్నారు.ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా సైతం పలు కధనాలను ప్రచురించింది.

దాంతో రిషి సునక్ మరింత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

అయితే తాజాగా రిషి సునక్ సతీమణి ఇన్ఫోసిస్ నారాయాణమూర్తి కూతురు అక్షతా మూర్తి పన్ను చెల్లింపులు చేయడం లేదని ప్రభుత్వాలని మోసం చేస్తున్నారంటూ యూకె మీడియా కోడై కూసింది.

దాంతో అక్షితా మూర్తి పన్ను చెల్లింపులపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఈ క్రమంలోనే రిషి సునక్, అక్షితా మూర్తి ఇద్దరినీ టార్గెట్ చేస్తూ బ్రిటన్ మీడియా కధనాలు ప్రచురించింది.

అయితే ఈ క్రమంలోనే అక్షితా మూర్తి ఆస్తులకు సంభందించి మరో విషయం ప్రచారంలోకి వచ్చింది అదేంటంటే.

Telugu Akshita Murthy, Britain, International, Queenelizabeth, Rishi Sunak, King

అక్షితా మూర్తి ఆస్తుల విలువ బ్రిటన్ రాణి ఎలిజిబెత్ ఆస్తుల కంటే ఎక్కువట.ఏంటి షాక్ అయ్యారా అవును మీరు విన్నది నిజమే.బ్రిటన్ రాణికి సంభందించిన వ్యక్తిగత ఆస్తుల కంటే కూడా అక్షితా మూర్తి ఆస్తులు అధికమని స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ వెల్లడించింది.

ఏఎఫ్పి నివేదిక ప్రకారం సదరు కంపెనీ ఈ విషయాలని వెల్లడించింది.అక్షితా మూర్తికి ఇన్ఫోసిస్ లో బిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొంది.ఈ ఆస్తుల విలువ బ్రిటన్ రాణికి ఉన్న 460 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.ఇదిలాఉంటే డొమిసైల్ స్టేటస్ కారణంగా అక్షితా మూర్తి ప్రతీ ఏటా దాదాపు 2.1 మిలియన్ పౌండ్ల పన్నుల నుంచీ తప్పించుకుంటున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube