మిర్రర్‌లో వచ్చిన కథనం ప్రకారం ఇంగ్లండ్‌లో ఉంటున్న మహిళ లిండా వాకర్ గత మూడేళ్లుగా తుంటి సమస్యతో బాధపడుతోంది.తుంటి చికిత్స కోసం మూడు సంవత్సరాలుగా వేచి చూస్తోంది.
అదే సమయంలో ఈ సమస్య కారణంగా ఆమె ఆఫీసుకు 4 నెలలు దూరం కావాల్సివచ్చింది.ఈ ఉదంతం కోర్టు వరకూ చేరింది.
ట్రిబ్యునల్‌లో విచారణ సందర్భంగా లిండా మాట్లాడుతూ నేను కొత్త కుర్చీని అడిగాను, ఎందుకంటే నేను కూర్చుంటున్న కుర్చీ వలన నొప్పి పెరిగింది.దీంతో నేను నా కుర్చీకి ఉన్న ఆర్మ్‌రెస్ట్‌లను తీసివేయమని అడిగాను, కానీ ఇంజనీర్ క్రిస్టోఫర్ హోయ్ ఈ పని చేయడానికి అయిష్టతను వ్యక్తం చేశారు.
ఎందుకంటే ఆ కుర్చీ స్క్రూలను విప్పితే కుర్చీ చెత్తగా కనిపిస్తుందన్నాడని ఆరోపించింది.ఆ మహిళ పని చేసే సంస్థ యూకేలోని టైన్ అండ్ వేర్ మెట్రోపాలిటన్ కౌంటీలో ఉంది.
కంపెనీ పేరు మాడ్యులర్ ఆఫీస్ & స్టోరేజ్ సిస్టమ్స్ లిమిటెడ్.ఈ సంస్థ మహిళకు కుర్చీని ఏర్పాటు చేయలేకపోయింది.
విచారణలో లిండా ఇంకా మాట్లాడుతూ ఆఫీసులో జరిగిన ఒక సమావేశంలో తన కుర్చీ సమస్య గురించి ఉన్నతాధికారులకు చెప్పాను.
కుర్చీ వల్ల కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు.
లిండా తన ఉన్నతాధికారులతో తనకు కొత్త కుర్చీని ఏర్పాటు చేయాలని కోరింది.ఇది జరిగాక ఆమెకు ఒక లేఖవచ్చింది.
ఆమె ఓ సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.లిండా ఆరోగ్యం బాగోలేదని కంపెనీ వాదించింది.
ఈ సమయంలో, కంపెనీ బాస్ మిస్టర్ రిమింగ్టన్ మాట్లాడుతూ మేము ఎంత బిజీగా ఉంటామో అర్థం చేసుకోవాలి.లిండా లేకపోవడంతో ఆఫీసు పని దెబ్బతింటుంది.
సిబ్బంది ఇబ్బందులు పడ్డారు అని తెలిపాడు.అయితే ఈ కేసు కోర్టుకు వెళ్లింది.
ఎంప్లాయ్‌మెంట్ జడ్జి గెరాల్డ్ జాన్సన్ తీర్పు ముగింపులో ఇలా అన్నారు.సదరు మహిళా ఉద్యోగికి తగిన డెస్క్ దొరికితే, ఆమె త్వరగా కార్యాలయానికి వచ్చి తన డ్యూటీ చేయగలనని చెప్పారు.
కంపెనీ అలా చేయడంలో విఫలమైందన్నారు.దీనికి పరిహారంగా ఆమెకు 22 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.







