మోడీ కోసం ‘‘కిచిడి’’ వండిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఫోటోలు వైరల్..!!

భారత్- ఆస్ట్రేలియాల మధ్య దశాబ్ధాలుగా మంచి స్నేహ సంబంధాలు వున్న సంగతి తెలిసిందే.ఏళ్ల క్రితమే భారతీయులు ఉపాధి కోసం అక్కడికి వెళ్లారు, ఇంకా వెళ్తూనే వున్నారు కూడా.

 Australia Pm Cooks 'friend' Modi's 'favourite' Khichdi, 'celebrates' New Trade T-TeluguStop.com

ఇక క్వాడ్ కూటమిలో భారత్- ఆస్ట్రేలియాలు సభ్యదేశాలుగా వున్నాయి.ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌కు మన ప్రధాని నరేంద్ర మోడీ అంటే ప్రత్యేకమైన అభిమానం.

ఈ నేపథ్యంలోనే మోడీకి ఎంతో ఇష్టమైన ‘‘కిచిడి’’ వండి ఆ ఫోటోను షేర్ చేశారు మోరిసన్.

ఇటీవల భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA)ను పురస్కరించుకుని ఈ “కిచిడీని” తయారు చేశారు.

ఆస్ట్రేలియాలో కర్రీ నైట్ గా జరుపుకునే రాత్రి విందును పురస్కరించుకుని.మోడీ స్వస్థలమైన గుజరాత్‌లో ప్రజలు ఇష్టంగా తినే కిచిడీని తన నివాసంలో వండినట్టు మోరీసన్ తెలిపారు.

ఈమేరకు తాము వండిన వంటకాల ఫోటోలను ఇన్‌స్టాలో పెట్టారు ఆస్ట్రేలియా ప్రధాని.

ఈ ఏడాది ఏప్రిల్ 2న భారత్ – ఆస్ట్రేలియాలు ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

వాణిజ్య ఒప్పందంపై పీయూష్‌ గోయల్‌, ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం-పెట్టుబడి శాఖల మంత్రి డాన్‌ టెహన్‌ సంతకాలు చేశారు.ఒక అభివృద్ధి చెందిన దేశంతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం దశాబ్ద కాలం తరువాత ఇదే తొలిసారి.

Telugu Australiapm, India Australia, Kichidi, Dan Tehan, Piyush Goyal, Primenare

ఆస్ట్రేలియా భారత్‌కు 17వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, అలాగే మనదేశం ఆస్ట్రేలియాకు 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.2021లో ఇరుదేశాల మధ్య 27.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 45 నుంచి 50 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు.ఈ వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

కాగా.ప్రధాని మోడీ తనకిష్టమైన కిచిడి గురించి పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యితో తయారు చేసే ఈ వంటకాన్ని గుజరాతీలు ఇష్టంగా ఆరగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube