టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
స్టార్ హీరోలతో మాత్రమే కాదు చిన్న హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా వరస అవకాశాలు అందుకుంటూ కుర్ర భామలకు పోటీ ఇస్తుంది.ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా ఇప్పటికే అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ దూసుకు పోతుంది.
ఈ మధ్యనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చేస్తుంది.పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ స్పీడ్ పెంచింది.
అయితే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మరేమీ సినిమాలు ఒప్పుకోవడం లేదు.ఒప్పుకున్నా రెండు మూడు సినిమాలు నుండి కూడా తప్పుకుంది.
ఎందుకంటే కాజల్ తల్లి కాబోతుంది. అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ప్రెసెంట్ ఈమె మాతృత్వం లోని మాధుర్యన్ని ఆస్వాదిస్తోంది.
మరొక నెల రోజుల్లో ఈమె పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతుంది.ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు ఏదొక ఫోటో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.తాజాగా మరోసారి ఈమె బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.
”అన్నీ మన చేతుల్లో ఉన్నాయని అనుకుంటాం.కానీ అదే సమయంలో మన మనసంతా గజిబిజిగా మారిపోతుంది.ఎప్పుడు ఏమి చేస్తున్నామో, ఏమి చేయాలో తెలియకుండానే సమయం గడిచి పోతుంటుంది.మన పిల్లలను, జీవిత భాగస్వామిని ప్రేమిస్తున్నప్పుడు ఈ బావోద్వేగపు బంధంలో మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం.
అంటూ ఎమోషనల్ గా తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది.దీంతో పాటు ఈమె షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.