వైసీపీ ఎంపీలు ఇటీవల చంద్రబాబు ప్రతిపక్షగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అంటూ కామెంట్లు చేయడం పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రియాక్ట్ అయ్యారు.వైసీపీ ఎంపీలు చెప్పింది నిజమేనని జగన్ ప్రతిపక్ష నేతగా ఉండటమే రాష్ట్రానికి మంచిదని రివర్స్ కౌంటర్ వేశారు.
ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న కనకమేడల రవీంద్ర కుమార్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అని అన్నారు.
ప్రధాని మోడీ ని కలిసిన జగన్… ఏం అడిగారు అని ప్రశ్నిస్తే తమను తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని వైసీపీ ఎంపీలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.చంద్రబాబును విమర్శించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ చెప్పిన విషయాన్నే తెలుగుదేశం పార్టీ చెబుతోందని చెప్పుకొచ్చారు.ఒకవేళ కాగ్ నివేదిక తప్పయితే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఆ విషయంపై ఎందుకు మాట్లాడలేదని కనకమేడల నిలదీశారు.







