డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గని’.ఈ సినిమాలో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
ఇక ఈయన సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందింది.
ఇక ఈ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో విడుదల కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.పైగా వరుణ్ తేజ్ కు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.
కథ:
ఇందులో వరుణ్ తేజ్ గని అనే పాత్రలో నటించాడు.ఇక ఆయనకు చిన్నతనం నుంచి బాక్సర్ అవ్వాలన్న కోరిక బాగా ఉంటుంది.
దాంతో ఎంతో కష్టపడి శిక్షణ తీసుకున్నాడు.కానీ కొన్ని కారణాల వల్ల తన తల్లి తనను బాక్సింగ్ వదిలేయమని అంటుంది.
పైగా ఒట్టు కూడా వేడుకుంటుంది.ఇక తన అమ్మ కి ఇచ్చిన మాట తో గని బాక్సింగ్ ను వదిలేస్తాడు.
ఇక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత గని కి మళ్లీ బాక్సింగ్ ఆడాల్సి వస్తుంది.దీంతో ఈ సారి తను ఎలాగైనా అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాపోటీలో ఛాంపియన్ అవ్వాలని అనుకుంటాడు.
కానీ అధికారుల అవినీతి వలన అది దక్కకుండా పోతుంది.ఇక గని తల్లి ఎందుకు బాక్సింగ్ వదిలేయమని.
చివరికి గని తను అనుకున్న లక్ష్యానికి చేరుతాడా లేదా అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

నటినటుల నటన:
వరుణ్ తేజ్ నటన బాగా హైలెట్ గా నిలిచింది.అతని స్టైల్, అతని ఎనర్జీ ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇందులో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఇందులో నటించిన ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, జగపతి బాబు తదితరులు తమ పాత్రలలో లీనమయ్యారు.ఇందులో తమన్నా కూడా స్పెషల్ సాంగ్ లో నటించి బాగా ఆకట్టుకుంది.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా డైరెక్టర్ ఈ సినిమాతో కొత్త దర్శకుడిగా పరిచయం కాగా.కాస్త పొరపాట్లు చేసినట్లు కనిపించింది.
చాలా వరకు సినిమాను బాగా తీయాలనే ప్రయత్నం చేశాడు.ఇక ఈ సినిమాకు మంచి కథను కూడా ఎంచుకున్నాడు.
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా హైలెట్ గా నిలిచింది.సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు.

విశ్లేషణ:
ఇక ఈ సినిమా ఫస్టాఫ్ కాస్త డల్ గా అనిపించింది.సెకండాఫ్ మాత్రం బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాల్లో చూశాం.ఇక వాటిలాగానే ఈ సినిమా కూడా రొటీన్ గా ఉన్నట్లు కనిపించింది.ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే చూపించారు.
ప్లస్ పాయింట్స్:
వరుణ్ తేజ్ నటన, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బాక్సింగ్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ కాస్త స్లో గా అనిపించింది.అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
కథనంలో కూడా ఇంకాస్త మార్పులు ఉంటే బాగుండేది.

బాటమ్ లైన్:
ఇప్పటికే బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి.ఇక ఈ సినిమా కూడా అదే నేపథ్యంలో రావడంతో.ప్రేక్షకులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఈ సినిమా రొటీన్ గా అనిపించడంతో.మొత్తానికి గని పంచ్ లో అంత కిక్ లేనట్లుగా కనిపించింది.







