అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ఎన్టీఆర్ అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు కష్ట పడ్డారు.
ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఎట్టకేలకు ఈ సినిమాని ఏప్రిల్ 29వ తేదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్, అలియా భట్, కృతి శెట్టి వంటి వారి పేర్లు పెద్ద ఎత్తున వినిపించినప్పటికీ హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన రాలేదు.
ఇకపోతే ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను నియమించాలని తారక్ రికమెండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభించక ముందే ఈ సినిమా కోసం తారక్ మరో కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఏ సినిమా లేకుండా RRR కోసం కష్టపడ్డారు.ఇకపై తారక్ మరే సినిమాల కోసం సమయం వృధా చేసుకోదలచుకోలేదని తెలుస్తుంది.ఇక ఈ సినిమాను కేవలం 70 రోజులలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది.మరి ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ సాధ్యమైనా.కొరటాల70 రోజులలో సినిమా పూర్తి చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.








