1.తానా తెలుగు తేజం పోటీలు
తెలుగు భాషా సాహిత్యం , పరివ్యాప్తి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించింది.తాజాగా తానా తెలుగు పరి వ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో తెలుగు తేజం పోటీలు నిర్వహిస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న పిల్లలు మినహా ప్రవాస దేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
2.కువైట్ లోని భారత ఎంబసీ కీలక ప్రకటన
టూరిస్ట్ వీసాల విషయంలో కువైట్ లో భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.
టూరిస్ట్ వీసాలు కావాలి అనుకునే కువైటీలు దరఖాస్తు చేసుకావచ్చని ప్రకటించింది.భారత్ లో కరోనా పరిస్తఇతులు అదుపులోకి రావడం , ప్రభుత్వం ప్రయాణ అంశాలను తొలగించడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ఎంబసీ ప్రకటించింది.
3.రష్యా యుద్ధ నేరాలపై జర్మనీ మాజీ మంత్రుల ఫిర్యాదు
ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో రష్యా పాల్పడుతున్న యుద్ద నేరాలపై జర్మనీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఫిర్యాదు చేశారు.రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన అధికార యంత్రాంగం , రష్యా ఆర్మీ పై యుద్ధ నేరాల విచారణ ప్రారంభించాలని కోర్టును ఆశ్రయించారు.
4.రష్యా సైన్యం లో తిరుగుబాటు
రష్యా సైన్యం తిరుగుబాటు వచ్చినట్లుగా రష్యా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ముఖ్యంగా 60 మంది మెరికల్లాంటి రష్యన్ సైనికులు యుద్ధాన్ని వ్యతిరేకించడంతో పాటు పై అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం తో వారిని వెనక్కి పిలిపించి జైలు శిక్ష విధించినట్లు గా రష్యన్ మీడియా పేర్కొంది.
5.భారత్ కు రష్యా హెచ్చరికలు
స్క్రీన్ పై యుద్ధానికి దిగిన రష్యా కు మద్దతు ఇస్తున్న భారత్ పై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది.అమెరికాతో సంబంధాలు క్లిష్టతరం అవుతాయని హెచ్చరించింది.
6.అమెరికా కు చైనా వార్నింగ్
అమెరికాకు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది.వచ్చే వారంలో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు రాబోతున్నట్లు వస్తున్న వార్తలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.అమెరికా ఇదే పద్ధతిని కొనసాగిస్తే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చైనా చాలా సెకండ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
7.ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీం కోర్టు షాక్
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేసింది.డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగంలోని 95 ను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
8.రష్యా ఉక్రెయిన్ యుద్ధం .చైనా లో ఆందోళనలు
రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై చైనాలో భయాందోళనలు మొదలయ్యాయి.ఈ యుద్ధం లో రష్యా గెలిస్తే కనుక చైనా కమ్యూనిస్ట్ భావజాలాన్ని అనుకున్నట్టు పనిచేస్తుంది.రష్యా ఓటమి చెందితే చైనా పాశ్చాత్య దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ఆందోళనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉన్నారు.