టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.
గత నెల మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది.అయితే ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.
ఇందులో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించిన విషయం తేలిసిందే.
ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో జెన్నీ అనే ఒక బ్రిటిష్ యువతిగా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా సంచలన విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం సక్సెస్ మీట్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఈ సందర్భంగా ఒలీవియా మోరిస్ ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఒలీవియా మోరిస్.సినిమా విడుదలైన మొదటి రోజు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ సినిమాను చూశానని, అందులో కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు తాను ఫిదా అయినట్లు తెలిపింది ఒలీవియా మోరిస్.

అంతే కాకుండా ఆ పాటలో ఎన్టీఆర్ ని చూస్తే కన్నీళ్లు వచ్చాయని, సినిమాలోని ఉన్న పలు సన్నివేశాలను చూసి భావోద్వేగానికి లోనయ్యాను అని తెలిపింది.అనంతరం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ తారక్ పై, తారక్ నటన పై ప్రశంసల వర్షం కురిపించింది ఒలీవియా మోరీస్.అంతేకాకుండా ఈ సినిమాలో నాటు నాటు పాట బాగా నచ్చిందని, ఆ పాటకు తన బాయ్ ఫ్రెండ్ కూడా డ్యాన్స్ ను ట్రై చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఒలీవియా మోరిస్.
దర్శకుడు రాజమౌళి కూడా ఒక అద్భుతమైన డైరెక్టర్ అంటూ రాజమౌళి ని పొగిడింది.







