యాప్‌లో ఆర్డర్.. చూయింగ్ గమ్ తిని యువతి మృతి!.. జరిగిందిదే..

చూయింగ్ గమ్ తినడం వల్ల 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది.ఇద్దరు స్నేహితులు ఈ చూయింగ్ గ‌మ్ తిన్నారు.

 Woman Killed By Cannabis Sweet Police Issued Details, Chewing Gum, Sweet Candis,-TeluguStop.com

కొద్దిసేపటికే ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు.తరువాత ఒకరు మరణించారు.

ఈ కేసులో ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ది సన్ కథనం ప్రకారం ఈ ఉదంతం తూర్పు లండన్‌లో చోటుచేసుకుంది.

అక్కడ ఇద్దరు స్నేహితులు చూయింగ్ గ‌మ్‌ తినాలని అనుకున్నారు.వారిలో ఒకరు మెసేజింగ్ యాప్ ద్వారా క్లాస్ బి క్యాండీని ఆర్డర్ చేశారు.

ఇది అతని ఇంటి వద్ద పంపిణీ అయ్యింది.ఈ మిఠాయి “Trrlli Peachie O’s” బ్రాండ్‌కు చెందిన‌ది.

చూయింగ్ గ‌మ్ తినగానే వారిద్ద‌రి ఆరోగ్యం క్షీణించింది.అనంతరం ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ 23 ఏళ్ల యువతి మృతి చెందింది.యువ‌కునికి వైద్య చికిత్స జ‌రుగుతోంది.

క్యాండీ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.కొద్ది సేప‌టి త‌రువాత ఆ యువ‌తి స్నేహితుడు చికిత్స తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

ఈ కేసులో 37 ఏళ్ల లియోన్ బ్రౌన్‌ను అరెస్టు చేశారు.నెల రోజుల క్రితం జరిగిన ఘటనతో ఈ అంశాన్నిముడిపెట్టి పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఓ మహిళ చూయింగ్ గ‌మ్ తిని అస్వస్థతకు గురైంది.

Telugu Gum, London, Stuart Bell, Sweet Candis, Sweet Cannabis, Trrlli Peachie-La

ఆమెను ఆస్పత్రికి తరలించి, చికిత్స చేసి త‌రువాత త‌ర‌లించారు.ఈ రెండు చూయింగ్ గ‌మ్‌లు ఒకే బ్యాచ్‌కి చెందినవా ?అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.చీఫ్ సూపరింటెండెంట్ స్టువర్ట్ బెల్ ప్రజలను హెచ్చరించారు.

ప్రజలందరూ న‌కిలీ వస్తువులను వినియోగించడం మానుకోవాలని అన్నారు.అలాగే ప్యాక్ చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి.

ఈ అక్రమాల‌కు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube