సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో లయన్స్ కంటి ఆసుపత్రి ముందు రోడ్డు పక్కన మట్డిలో కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ దిగబడింది.టిప్పర్ ను బయటకు లాగడానికి వచ్చిన జేసీబీ కూడా గుంతలో దిగుబడిపోయింది.
విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న స్ధానిక కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్ మాట్లాడుతూ ఇక్కడ నుండి నిత్యం లోడ్లతో వెళుతున్న లారీలు ఈ మట్టిలో దిగబడుతున్నాయని తెలిపారు.అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కొరకు రోడ్డు పక్కన గుంతలు తవ్వి పైపులు వేసిన తరువాత కాంట్రాక్టరు మట్టిపోసి వదిలివేశారని అన్నారు.
దీంతో ఇక్కడ నిత్యం లారీలు దిగబడి సరకు నష్టం జరుగుతుందన్నారు.మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారని,తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.