జనసేన కు ఇది చాలా కీలక సమయం. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది.
ఈ లోపు పార్టీని క్షేత్రస్థాయిలో కి తీసుకువెళ్లి , ఎన్నికల్లో గెలిపించే అంత స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది ఇప్పటికే పార్టీలో అనేక కమిటీలను పవన్ నియమించారు.క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
జన బలం పెంచుకునేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే సొంత బలం పైనే పవన్ ఆశలు పెట్టుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం పై ప్రజలకు మొహం మొత్తింది అని, రాబోయేది జనసేన ప్రభుత్వం అని పవన్ నమ్ముతున్నారు. పార్టీ కేడర్ కూ ఇదే చెబుతున్నారు. ఎన్నికల వరకు ఇదే రకమైన అభిప్రాయం తో పవన్ జనాల్లోకి వెళ్తే జనసేన కు రాజకీయంగా లాభం చేకూరుతుంది. కానీ ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసిన ప్రసంగం ఆ పార్టీ పై అనుమానాలు పెంచడంతో పాటు , , పార్టీలోకి వలసలకు బ్రేక్ పడే విధంగా చేసింది.
పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఓ నాయకుడు పవన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని , సరైన రాజకీయ వ్యూహాలను అమలు చేయకుండా జనసేనకు నష్టం కలిగించే విధంగా చేస్తున్నారనే అభిప్రాయాలు సొంత పార్టీ నాయకుల నుంచే వ్యక్తం అవుతున్నాయి.పార్టీ ఆవిర్భావ సభలో పవన్ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.బిజెపి రోడ్ మ్యాప్ కోసం తాము ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పడం గందరగోళంకు గురి చేసింది.
ఒకపక్క బిజెపి ,జనసేన లు విడివిడిగా ప్రజాబలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
జనసేన తో పోలిస్తే బీజేపీ ప్రభావం ఏపీలో పెద్దగా లేదు అయినా ఆ పార్టీ చెప్పినట్టుగానే తాము నడుచుకుంటాము అన్నట్లుగా పవన్ చెప్పడం రాబోయే రోజుల్లో జనసేన ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అలాగే వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకును చేర్చడం తమకు ఇష్టం లేదని అవసరమైతే వైసీపీ వ్యతిరేక పార్టీలు కలిసి నడుస్తామని అన్న విధంగా మాట్లాడడం మరింత ఇబ్బందికరంగా మారింది.ఇప్పుడు జనసేన లోకి వలసలు పెరుగుతున్నాయి.టిడిపి రాజకీయంగా ప్రభావం కోల్పోతూ ఉండడంతో.
ఇప్పుడు అందరి చూపు జనసేన పైనే పడింది.టిడిపి నుంచి పెద్ద ఎత్తున చేరికలు జనసేనలోకి ఉండబోతున్నాయి అనుకున్న సమయంలో ఆ పార్టీతో పొత్తు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు వలసలకు బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తోంది.
ఈ విషయంలో పవన్ అనవసర గందరగోళానికి గురైనట్టు గానే అందరిలోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.