వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజరస్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు థియేటర్ల వారు ముందుకు రాలేదు.
కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఈ సినిమా ను ప్రదర్శించేందుకు ముఖ్యం గా మల్టీప్లెక్స్ సినిమా హాల్స్ వారు ఈ సినిమా స్క్రీనింగ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.దాంతో రామ్ గోపాల్ వర్మ వారి పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
ట్విట్టర్ ద్వారా ఓ రేంజ్ లో వారిని ఏకి పడేశాడు.ఈ సినిమా ను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పోల్చుతూ ప్రమోషన్ చేస్తున్నాడు.
ఆ సినిమాలో ఇద్దరు హీరో లు ఉండగా తన సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని.ఆ సినిమా లో ఇద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటే తన హీరోయిన్స్ మధ్య రొమాన్స్ సన్నివేశాలు అంతకు మించి ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ సినిమా కు మా సినిమా కు ఎక్కువ తేడా లేదని రెండు సినిమా లు కూడా అద్భుతంగా ఉంటాయి అంటూ ఆయన చెబుతున్నాడు.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను ఉపయోగించి తన సినిమా కు విచ్చల విడిగా ప్రమోషన్ చేసుకుంటున్నాడు.

డేంజరస్ అనే టైటిల్ ను తెలుగు లో మా ఇష్టం గా మార్చాడే.అదే టైటిల్తో తెలుగు లో విడుదల చేయబోతున్నాడు.వేర్వేరు భాషల్లో వేర్వేరు టైటిల్స్ తో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు.నైనా గంగూలీ మరియు అప్సర రాణి ఈ సినిమా లో హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే.
వారిద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ లో ఉందని పోస్టర్ల లోనే ఆ విషయం అర్థమవుతోంది.ఇలాంటి ఒక సినిమా ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ రాలేదంటూ దర్శకుడు వర్మ బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు.
ప్రతి ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నాడు.మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.







