ఈ కష్టం ఎవరికీ రాకూడదు.. బావిలోకి దిగి ఈమె ఏం చేస్తోందంటే..!

వేసవికాలం వచ్చినప్పుడల్లా భారతదేశంలోని అనేక ప్రాంతాలు నీటి కొరత తో కుదేలు అవుతుంటాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది మహిళలు వేసవి అంతా తమ కుటుంబసభ్యుల అవసరాలకు నీటిని తీసుకొచ్చేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు.

 This Difficulty Should Not Come To Anyone What Is She Doing Going Down The Wel-TeluguStop.com

ఎప్పటినుంచో మహిళలను వేధిస్తోన్న ఈ నీటి కొరత సమస్య ఇప్పటికీ తీరనే లేదు.తాజాగా నీటి వనరులు ఎండిపోతున్నందున, మహారాష్ట్రలోని కొంతమంది మహిళలు స్వచ్ఛమైన త్రాగునీటిని పొందేందుకు నానా తిప్పలు పడుతున్నారు.

ఈ మహిళలు ఒక బకెట్టు నీటి కోసం లోతైన బావిలోకి దిగుతున్నారు.అయితే ఈ బావి పైనుంచి కిందకు దిగే క్రమంలో కాస్త పట్టుతప్పినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

కానీ తీవ్ర నీటి కొరతతో ఇలాంటి రిస్కీ పనులు చేయక తప్పడం లేదు.

నీటి కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టిన మహిళలకు సంబంధించి ఓ వీడియో ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ బావిలోకి మెట్ల సహాయంతో దిగడం చూడొచ్చు.నిజానికి మెట్లు అంటే పెద్దవి కావు.ఒక పాదంలో సగ భాగం మాత్రమే పట్టేంతా చిన్నవి.అలాంటి మెట్లను చాలా జాగ్రత్తగా పట్టుకొని ఈమె కిందికి దిగింది.

మిగతా మహిళలు కూడా ఇలాగే నీటిని కిందనుంచి పైకి తీసుకు వచ్చేందుకు అక్కడ క్యూ కట్టారు. నాసిక్ జిల్లాలోని ఓ గ్రామంలో కనిపించిన దయనీయ దృశ్యాలివి.

ఈ వీడియోని ఒక జర్నలిస్టు షేర్ చేయగా దీనికి ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు.“అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది.ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు” అని కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube