సైలెంట్ గా జగన్ టూర్ కి వెళ్లి వచ్చారు.ఎక్కడా ఎటువంటి హడావుడి చోటుచేసకోలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ సులభంగానే లభించింది.ఆయనతో పాటు, కేంద్ర మంత్రులు బీజేపీ కీలక పెద్దల అపాయింట్మెంట్ జగన్ కు అనుకున్న సమయానికి లభించింది.
గతంలో ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు.చాలా సందర్భాల్లో అపాయింట్మెంట్ లభించక వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
దీనిపై టిడిపి , ఆ పార్టీ అనుకూల మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యేవి. ఢిల్లీ పెద్దలు పట్టించుకోవడంలేదని అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ఎద్దేవా చేసేవారు.
కానీ ఈసారి అటువంటి విమర్శలకు తావు లేకుండా ఢిల్లీ టూర్ సాగింది.ప్రధాని నరేంద్ర మోడీ తో గంటకు పైగా జగన్ భేటీ అయ్యారు ఏపీలో పెండింగ్ ప్రాజెక్టుల విషయంతో పాటు ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై జగన్ చర్చించారు.
అంతేకాదు ఏపీ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి జగన్ చర్చించారట.అలాగే త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల పైన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ల తోను జగన్ చర్చించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా తాము మద్దతు ఇస్తామని జగన్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తో చెప్పారట.ఇంకా అనేక అంశాల గురించి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలపై జగన్ నరేంద్ర మోదీ అమిత్ షా వంటి వారు చర్చించినట్లు సమాచారం.మొత్తంగా జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ కావడం తో వైసీపీ వర్గాలు ఆనందంలో ఉన్నాయి.ఢిల్లీలో జగన్ ఇంకా ఏ ఏ అంశాలపై బీజేపీ పెద్దలలో చర్చించారు అనే దానిపై టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.