మంచు విష్ణు 100 మంది ప్రాణాలను కాపాడాడా.. ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలివే!

ఈ మధ్య కాలంలో కొంతమంది నెటిజన్లు మంచు విష్ణును సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎంపికైన తర్వాత ఆయనను ట్రోల్ చేసేవాళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది.

 Interesting Facts About Manchu Vishnu Details Here Goes Viral , Interesting F-TeluguStop.com

సన్నాఫ్ ఇండియా సినిమా విడుదలైన మోహన్ బాబును, మంచు విష్ణును కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్ చేశారు.అయితే ఆశ్రమాన్ని నడిపే ఒక వ్యక్తి మంచు విష్ణు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆశ్రమంలో ఎవరైనా పారిపోతే పోలీసులకు సమాచారం ఇస్తామని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు.ఆశ్రమంలో మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు వైద్య చికిత్స అందేలా చూస్తామని ఆయన అన్నారు.మానసిక సమస్యలు ఉండటం వల్ల తమ ఆశ్రమానికి సెలబ్రిటీలు ఎక్కువగా రావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.హీరో కార్తికేయ తమ ఆశ్రమంలోనే పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారని ఆయన అన్నారు.

Telugu Corona, Teja, Karthikeya, Karthikeyan, Manchu Vishnu, Mohan Babu, Orphana

కార్తికేయ తన పుట్టినరోజు వేడుకలను ఆశ్రమంలోనే జరుపుకున్నారని సదరు వ్యక్తి వెల్లడించారు. మంచు విష్ణు గారు ఆశ్రమానికి రాలేదని కరోనా సమయంలో ఇబ్బందులు పడుతుండగా వాళ్ల స్కూల్ నుంచి ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్న్నం, రాత్రి బ్రేక్ ఫాస్ట్, భోజనం అందేలా చేశారని తెలిపారు.100 మంది ఆకలితో అలమటిస్తుంటే 20 రోజుల పాటు భోజనం పంపి ప్రాణాలు కాపాడారని ఆయన అన్నారు.

Telugu Corona, Teja, Karthikeya, Karthikeyan, Manchu Vishnu, Mohan Babu, Orphana

కరోనా సమయంలో అక్కడ అందరికీ పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు.ఆశ్రమానికి నలుగురు మెంబర్స్ ఉన్నారని ఆయన వెల్లడించారు.సెలబ్రిటీలు కాన్సెప్ట్ ఏమిటని అడుగుతారని కాన్సెప్ట్ చెబితే సెలబ్రిటీలు హ్యాపీగా ఫీలవుతున్నారని ఆయన అన్నారు.

దర్శకుడు తేజ కూడా తమ ఆశ్రమానికి వచ్చారని ఆయన వెల్లడించారు.మంచు విష్ణు మంచి మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

తను సహాయం చేసినా ఆ సహాయాల గురించి చెప్పుకోవడానికి మంచు విష్ణు ఇష్టపడరనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube