హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నిర్వహించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.హైదరాబాద్ చిక్కడపల్లి లోని ప్రైవేట్ కాలేజీలో నిర్వహించిన ఎలిజిబులిటీ టెస్ట్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో డి సి పి లు అడిషనల్ డిసిపి లు ఏసిపి లు స్థానిక సీఐ,ఎస్ఐలు పాల్గొన్నారు.సి వి ఆనంద్ మాట్లాడుతూ శాసనసభలో ముఖ్యమంత్రి 80వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి స్టేట్ గవర్నమెంటు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించడంతో తో దానికి అనుగుణంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ప్రారంభించామన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ లో 80వేల వేకెన్సీస్ లో 18000 ఉండబోతున్నాయని డిజిపి ఆఫీస్ నుండి అంచనా వేశారని అందుకుగాను గత నెల రోజుల నుండి ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోసం ప్రారంభించామని హైదరాబాదులో ప్రతి వ్యక్తికి, వాడలలో ప్రచారం చేశామన్నారు.గూగుల్ లింక్ ద్వారా 21 వేల మంది ఎన్రోల్ చేసుకోగా పదహారు వేల మంది విద్యార్థులు 36 సెంటర్లలో పరీక్ష వ్రాశారాణి తెలిపారు.5 వేల మందిని షార్ట్ లిస్ట్ చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తాం అన్నారు.
ప్రతి జోన్ కు 2 సెంటర్లు ఒక్కో సెంటర్ కు 500 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పిస్తాం అని తెలిపారు.
దీనికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్, జాయింట్ కమిషనర్ అడ్మిన్ ఇంచార్జి రమేష్ సారధ్యం వహిస్తున్నారన్నారు.నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తామని హైదరాబాద్ సిటీ పోలీసు శాఖలో ఖాళీలు లేకుండా భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు.
కార్యక్రమంలో డి సి పిలు, అడిషనల్ డి సి పి లు భాగ్య కిరణ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ వారు పాల్గొన్నారు.







