బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి కంగనా రనౌత్.ఈమె తాను చెప్పాల్సిన విషయం ఎలాంటి భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతుంది.
స్టార్స్ అని కూడా చూడకుండా ఏ విషయం అయినా ముఖం మీదనే చెప్పేస్తుంది.ఈమె చేసే వ్యాఖ్యలు ఎప్పుడు కాంట్రవర్సీ అవుతూనే ఉంటాయి.
దీంతో కంగనా ప్రతీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
ఈమె తాజాగా మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమె హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఇటీవలే హోస్ట్ గా కూడా మారిపోయింది.
ఈమె లాకప్ షోతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తుంది.ఈ షో ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుని టాప్ షోగా మారిపోయింది.
దీనిని చాలా మంది ఇష్టపడి మరీ చూస్తున్నారు.
అందుకే కంగనా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది.
ఈమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ ఆనందంలో ఈమె బాలీవుడ్ స్టార్స్ పైన ఆసక్తికర కామెంట్స్ చేసింది.తన సోషల్ మీడియా ఖాతాలో తాజాగా ఈమె ఒక పోస్ట్ షేర్ చేసింది.”బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ కుమార్, రణవీర్ సింగ్ వంటి చాలా మంది నటులు పాపులారిటీ సంపాదించు కున్నారు.కానీ హోస్ట్ గా ఫెయిల్ అయ్యారు.

అయితే అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ మాత్రమే ఇటు నటులుగానే కాకుండా హోస్టులుగా కూడా సక్సెస్ అయ్యారు.
ఇలా రెండింట్లో సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.నాపై అసూయతో నన్ను, నా షోను అప్రతిష్టపాలు చేయడానికి చుస్తున్నారు కానీ వారి వల్ల కాదు ఎందుకంటే నా షో ను నేను రక్షించు కుంటాను.
నన్ను ఎంతమంది విమర్శించినా పట్టించుకోను.ఈతరం హోస్టులలో నేను విజయం సాధించడం నాకు సంతోషంగా ఉంది.అంటూ పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈమె పేర్లతో సహా చెప్పి మరీ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.







