ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది.వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే సాయిపల్లవి నిత్యం ఎంతో చురుగ్గా ఉంటారు.
ఇలా తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకునే సాయిపల్లవి తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయట పెట్టారు.ఇలా తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఈ ముద్దుగుమ్మ ప్రతి రోజూ ఎంతో శారీరకశ్రమ చేస్తానని అది తన బ్యూటీ సీక్రెట్ అని వెల్లడించారు.
శారీరక శ్రమ చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఆరోగ్యం బాగుంటే అందం కూడా రెట్టింపు అవుతుందని సాయిపల్లవి వెల్లడించారు.

ఈ క్రమంలోనే తాను ఆరోగ్యం కోసం అందం కోసం ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ జిమ్ లో సమయం గడపుతానని, వీలైనంత వరకు ఏదో ఒక విధంగా శారీరక శ్రమ చేస్తూ తన ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకుంటానని తెలిపారు.ఇక ఉగాది పండుగ సందర్భంగా సాయి పల్లవి పొలం పనులు చేస్తూ కూలిగా మారి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇలా నిత్యం ఏదో ఒక శారీరక శ్రమ వల్ల తన అందాన్ని కాపాడుకుంటానని ఈమె వెల్లడించారు.







