ఉగాది పండుగ సందర్భంగా మనం శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము.ఈ క్రమంలోని ఈ ఏడాది మనకు ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.
ఈ క్రమంలోనే కొందరు పండితులు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీల జాతకాలు ఎలా ఉంటున్నాయో తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.
ప్రభాస్ నటించే సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయని నిర్మాతలు జాగ్రత్త పడాలని చెప్పారు.
ఈ విధంగా ప్రభాస్ గురించి చెప్పిన వేణు స్వామి అల్లు అర్జున్ జాతకాన్ని కూడా చెప్పారు.
అల్లు అర్జున్ కు ఐదు సంవత్సరాల వరకు ఇండస్ట్రీలో తిరుగులేదని, ఆయన ఒక బంగారు బాతని తెలిపారు.ఆయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలేనని,ప్రతి ఒక్క సినిమా కూడా 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతోందని వేణుస్వామి అల్లుఅర్జున్ జాతకాన్ని తెలిపారు.
ఇక రానా, ఎన్టీఆర్, మహేష్ బాబు జాతకాలు కూడా బాగున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.

ఇలా అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా పలువురు హీరోయిన్ల గురించి కూడా వెల్లడించారు.ఈ క్రమంలోనే 2024 వరకు పూజా హెగ్డే, సమంత, రష్మిక ఈ ముగ్గురు హీరోయిన్లకు తిరుగులేదని వేణు స్వామి ఈ సందర్భంగా సెలబ్రిటీల జాతకాల గురించి తెలియజేశారు.ఈ క్రమంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







