పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి 11వ తేదీ విడుదలయింది.
అయితే ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఇలా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిన ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇలా విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి రావడంతో ఎంతోమంది ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవడంతో థియేటర్ లో మిస్ అయిన వారు ఇక్కడ చూస్తూ సినిమాకి మంచి విజయాన్ని అందిస్తున్నారు.
థియేటర్లో ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది.ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాని రికార్డును కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది.

రాధేశ్యామ్ సినిమా ఓటీటీలో విడుదలైన 2 గంటల 5 నిమిషాలకి ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబట్టింది.ఇక ఈ సినిమా విడుదల కాకముందు ఈ రికార్డు పుష్ప సినిమా పై ఉండేది.పుష్ప’ చిత్రం విడుదలైన 8 గంటల 22 నిమిషాలకు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసి రికార్డు సృష్టించగా ఈ రికార్డును రాధేశ్యామ్ బ్రేక్ చేసిందని చెప్పాలి.







