రెండేళ్ల తరువాత పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌

హైదరాబాద్‌, 04 ఏప్రిల్‌ 2022 : తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహి స్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తాము తమ పాల ధరలను పెంచినట్లు వెల్లడించింది.రెండు సంవత్సరాల తరువాత ఈ పెంపుకు ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో పాటుగా ముడి సరుకుల ధరలు పెరగడం కారణం.

 Sid's Farm Increased Milk Prices After 2 Years , Sid's Farm, Milk, Siddor Farm F-TeluguStop.com

పెంచిన ఈ ధరలతో ఆవు పాలు ధర 2 రూపాయలు పెరగ్గా, గేదె పాలు మూడు రూపాయలు, స్కిమ్డ్‌ పాలు మూడు రూపాయల ధర పెరిగింది.పెంచిన ఈ థరలతో 500మిల్లీ లీటర్ల ఆవు పాలు ఇప్పుడు 40 రూపాయలకు , గేదె పాలు 48 రూపాయలకు లభిస్తే , స్కిమ్డ్‌ పాలు 30 రూపాయలకు లభిస్తాయి.

సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘గత రెండు సంవత్సరాలుగా ముడి పాల ధరలు 15%కు పైగా పెరిగాయి.ఇంధన ధరలు 45 % పెరిగాయి.

ద్రవ్యోల్బణ ప్రభావంతో మేత, ప్రింటింగ్‌ ఇంక్‌ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.ఇవన్నీ కలిసి మొత్తంమ్మీద ఇన్‌ఫుట్‌ ధరలు పెంచాయి.

దానితో తప్పనిసరై పాల ధరలు పెంచాల్సి వచ్చింది.నాణ్యతకు సిద్స్‌ ఫార్మ్‌ కట్టుబడి ఉంది.

ఇటీవలి కాలంలో నాణ్యత నియంత్రణ కోసం సిద్స్‌ ఫార్మ్‌ గణనీయంగా పెట్టుబడులు పెట్టింది.పెంచిన ఈ ధరలు మేము నాణ్యతను మరింతగా వృద్ధి చేసేందుకు సహాయపడతాయి’’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube