తెలంగాణలోని ఆ జిల్లాలో పుష్ప విలన్ ప్రత్యక్షం.. షాకైన ప్రజలు.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.

 Pushpa Villain In Karimnagar, Pushpa Movie, Pushpa Vilan, Telangana, Karimnagar-TeluguStop.com

సినిమాలో నటీనటుల నటనకు గాను పలువురు ప్రముఖులు వారిపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నటీనటలు వారి గెటప్ లతోనే ప్రేక్షకులను సగం ఆకట్టుకున్నారు.

పుష్ప సినిమా చూసిన వారికి ఇందులో భన్వార్ సింగ్ షేఖావత్ గా అదరగొట్టాడు ఫహద్ ఫాజిల్.

ఇందులో తన నటన తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఫహద్ ఫాజిల్ కరీంనగర్ లో దర్శనమిచ్చారు.దీనితో జనాలందరూ ఆయన దగ్గరకు వెళ్లి సెల్ఫీల కోసం ఎగబడ్డారు.అయితే తీరా దగ్గరికి వెళ్లి చూస్తే కానీ ఆయన ఎవరు అన్నది అర్థం కాలేదు.సదరు వ్యక్తి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.

అతని పేరు శ్రీనివాస్.తోటి వారందరూ కూడా ముద్దుగా బుల్లెట్ శ్రీను అని పిలుస్తారట.

అయితే శ్రీనివాస్ కు మొదటి నుంచి సినిమాలపై ఎక్కువ మక్కువ ఉండడంతో తనకు నచ్చిన హీరోల హెయిర్ స్టైల్ ఫాలో అవుతూ మెయింటెన్ చేస్తూ ఉండేవాడు.ఈ క్రమంలోనే శ్రీనివాస్ తాజాగా పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ లా గుండు లో కనిపించాలి అని అనుకున్నాడు.

అందుకోసం శ్రీనివాస్ గుండు చేయించుకుని, అచ్చం పుష్ప సినిమాలో విలన్ మాదిరిగా ఉండడంతో ప్రజలందరూ అతనిని ఒక్క సెల్ఫీ అంటూ సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు.దీనితో ఇలా ప్రజలు తన తో సెల్ఫీ దిగడం తనకు చాలా ఆనందంగా ఉంది అని అంటున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ బుల్లెట్ శ్రీను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube