భారత్ నుంచీ ఇతర దేశాలకు వలసలు వెళ్ళిన భారతీయుల సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో రకాల పధకాలను ప్రవేశపెట్టింది.వారికి ఆధార్ కార్డ్ జారీ మొదలు, భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు రాయితీలు, ఎన్నారై కోటాల పేరుతో వారికి ప్రత్యేక అవకాశాలు కూడా ఉంటాయి.
అంతేకాదు మాత్రు భూమి కోసం ఎన్నారైలు భారత్ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఉపాది కల్పన, నిరుద్యోగ సమస్యలు తీర్చేందుకుగాను ఎంతో కృషి చేస్తుంటారు.ఈ క్రమంలోనే కేంద్రం కూడా ఎన్నారైలకు పలు రంగాలలో వెసులుబాటులు కూడా ఇస్తుంటుంది.
తాజాగా
కేంద్ర ప్రభుత్వం ఎన్నారైలకు గుడ్ న్యూస్ తెలిపింది.ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలు విక్రయించే విషయంలో ఎన్నారైల నుంచీ ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని పన్ను విధింపు నుంచీ మినహాయింపు ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
ఐటీ సెక్షన్ 206 IG లో పన్ను చెల్లింపు మినహాయింపును ఇస్తూ కీలక ప్రకటనచేసింది.గతంలో టూర్ ఆపరేటర్లు ఓవర్ సీస్ టూర్ ప్యాకేజీలు అమ్మే సమయంలో సెక్షన్ 206 c ప్రకారం 5 శాతం పన్ను విధించాలి ఈ క్రమంలో ఎన్నారైల నుంచీ పన్ను విధింపు చేసి వారి దగ్గర నుంచీ వసూళ్లు చేయడం ఇబ్బందికరంగా ఉందని టూర్ ఆపరేటర్లు కేంద్ర పన్నుల విభాగానికి వినతులు పెట్టుకోవడంతో

గడిచిన కొంత కాలంగా వారి అభ్యర్ధనలను పరిశీలించిన కేంద్రం తాజాగా పన్ను విధానాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇంతకీ ఈ పన్ను మినాహయింపు ఎన్నారైలకు ఏ సమయంలో విధించబడుతుందంటే.ఇతర దేశాలలో ఉన్న భారతీయులు భారత్ కు పర్యటనకు వచ్చేటప్పుడు టూర్ ప్యాకేజ్ ల ద్వారా వస్తుంటారు.
అయితే ఆ సమయంలో వారి వద్ద పాన్ కార్డ్ ఉండచ్చు,ఉండక పోవచ్చు ఒక వేళ లేకపోతే అధిక మొత్తంలో అలాంటి వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఆ సమయంలో వారి ఐటీ రిటర్న్ లలో క్లెయిమ్ చేసుకోవడానికి వీలు ఉండదు.దాంతో టూర్ ఆపరేటర్ల కు ఈ పరిణామాలు ఇబ్బంది కరంగా మారుతాయి కాబట్టి ఈ విషయంలో కేంద్రానికి వచ్చిన వినతులను పరిశీలించి ఎన్నారైలకు కేవలం టూర్ ప్యాకేజ్ విషయంలో మాత్రమే పన్ను మినహాయింపును ఇస్తోంది కేంద్రం.







