హైదరాబాద్ లో ఉదయం భారీ ఎత్తున రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే.ఈ పార్టీ జరుగుతున్న సమయం లోనే పోలీసులు అక్కడికి వెళ్లి ఆ పార్టీని భగ్నం చేసి అందరిని అదుపులోకి తీసుకున్నారు.
రాడిసన్ బ్లు హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేయగా ఈ రేవ్ పార్టీ బయట పడింది… ఈ పార్టీలో దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
అయితే వీరిలో పెద్ద ఎత్తులో సినీ సెలెబ్రిటీల పిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఫండింగ్ మింక్ అనే పబ్ పై తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసులు పక్కా సమాచారం తో దాడి చేసారు.ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్టు తెలుస్తుంది.
ఈ లిస్టులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా ఉంది.

ఈ వ్యవహారంలో నాగబాబు కుమార్తె నిహారిక ను విచారించి.నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి పంపించినట్టు సమాచారం.అయితే ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు తాజాగా స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసారు.
ఈ ఘటనలో మెగా డాటర్ ఉండడంతో ఈ ఇష్యు మరింత పెద్దది అయ్యింది.

దీంతో ఈయన స్పందించక తప్పలేదు.ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.ఒక వీడియో రిలీజ్ చేసారు.
నాగబాబు ఈ వీడియోలో మాట్లాడుతూ.రాడిసన్ బ్లు పబ్ నిబంధనలను అతిక్రమించి పబ్ నడిపారని అందుకే పోలీసులు దాడి చేసారని.
అదే సమయంలో నిహారిక అక్కడ ఉందని.ఇందులో ఆమె తప్పు ఎంత మాత్రం లేదని.
ఆమెకు సంబంధించిన వరకు ఆమె క్లియర్ గా ఉందని.పోలీసుల సమాచారం ప్రకారం ఆమె తప్పు లేదని చెప్పారని.
సోషల్ మీడియా ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ వీడియో రిలీజ్ చేసారు.ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.







