పరుచూరి బ్రదర్స్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇక ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నాటి తరం నుంచి నేటి తరం వరకూ వందల సినిమాలకు కథలను అందించిన వీరిద్దరూ అన్నదమ్ములు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని చెప్పాలి.కేవలం రచయితలుగా మాత్రమే కాకుండా ఇక సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాలకు కూడా కథలు అందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక పరుచూరి బ్రదర్స్ ఏదైనా సినిమాకి కథ అందించారు అంటే చాలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.
అయితే పరుచూరి బ్రదర్స్ అంటే వెంకటేశ్వరరావు అలాగే పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి బ్రదర్స్ అంటే ఇద్దరు అయినప్పటికీ వీరిద్దరిని వేరుగా చూడలేము అనే చెప్పాలి.300కు పైగా సినిమాలకు ఇద్దరు అన్నదమ్ములు పనిచేశారు.పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు అయితే ప్రతి ప్రేక్షకుడుని కూడా మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటాయి.
నాటి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి తరం హీరోల వరకు కూడా సినిమా కథలను డైలాగులను అందించారు ఈ ఆదర్శ అన్నదమ్ములు.
అయితే ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ రచయితలుగా కొనసాగుతున్న పరుచూరి అన్నదమ్ములకు అసలు పరుచూరి బ్రదర్స్ అనే పేరు ఎలా వచ్చింది.

ఎవరు పెట్టారు ఉన్నది మాత్రం చాలామందికి తెలియదు.ఇక రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇద్దరు సొంత అన్నదమ్ములు కాబట్టి బ్రదర్స్ అని పెట్టుకున్నారు అని అందరూ అనుకుంటారు.అది మాత్రం నిజం కాదు.హలో బ్రదర్ అనే మాట వినిపించింది అంటే ఇక ఎన్టీరామారావు గుర్తుకు వస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులకు.ప్రభాస్ డార్లింగ్ అని అందర్నీ ఎలా పిలుస్తాడో.
అప్పట్లో ఎన్టీఆర్ హలో బ్రదర్ అని అని పిలిచేవారు.ఇలా మొదట్లో పరుచూరి బ్రదర్స్ ని కూడా అలా పిలిచింది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమేనట.
ఇక ఇలా ఎన్టీఆర్ పిలవడం వల్ల ఆ తర్వాత కాలంలో వీరిద్దరు పేరు పరుచూరి బ్రదర్స్ అని ఫేమస్ అయింది.ఈ విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ ఓసారి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.







