ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.ఇందులో భాగంగా తాజాగా ట్రాయ్ ఆర్డర్ కు అనుగుణంగా రెండు కొత్త ప్లాన్లను ఎయిర్టెల్ తీసుకొచ్చింది.
ఇవి రెండూ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.అయితే చౌక ధరలకే ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎయిర్టెల్ ప్రవేశపెట్టడం విశేషం.
ఇప్పటివరకు ప్రీపెయిడ్ ప్లాన్ లపై టెలికాం సంస్థలు ఆఫర్ చేస్తున్న వ్యాలిడిటీ కేవలం 28 రోజులే.అయితే ట్రాయ్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించింది.దీంతో ఎయిర్టెల్ రూ.296, రూ.319 విలువైన రెండు న్యూ ప్లాన్స్ లాంచ్ చేసింది.
రూ.296 రీఛార్జి ప్లాన్ లో అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 4జీ స్పీడ్ తో 25జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు లభిస్తున్నాయి.30 రోజుల వ్యాలిడిటీ తో వచ్చే ఈ ప్యాక్ తో మీరు షా అకాడమీలో 1 ఇయర్ ఫ్రీ ఆన్లైన్ కోర్సు, ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్, మూడు నెలల అపోలో 24/7 సర్కిల్, ఫ్రీ హలో ట్యూన్స్ వంటి రివార్డ్స్ దక్కించుకోవచ్చు.అయితే ఈ ప్యాక్ నెల మొత్తానికి కేవలం 25 జీబీ డేటా మాత్రమే ఆఫర్ చేస్తుందనే విషయాన్ని కస్టమర్లు గుర్తు పెట్టుకోవాలి.

రూ.319 రీఛార్జి ప్లాన్ లో అన్లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్, 4జీ స్పీడ్ తో డైలీ 2జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు లభిస్తున్నాయి.30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్ తో మీరు షా అకాడమీలో 1 ఇయర్ ఫ్రీ ఆన్లైన్ కోర్సు, ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్, మూడు నెలల లో 24/7 సర్కిల్, ఫ్రీ హలో ట్యూన్స్ వంటి రివార్డ్స్ సొంతం చేసుకోవచ్చు.మరిన్ని ప్యాక్ డీటెయిల్స్ ఎయిర్టెల్ యాప్ లో లేదా ఎయిర్టెల్ వెబ్ సైట్ లో మీరు తెలుసుకోవచ్చు.







