ఉగాది వేళ IPL క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పింది BCCI.అదేమంటే స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో దాదాపు 50% ప్రేక్షకులకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50% ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.T20 మెగా టోర్నీలో భాగంగా, ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50% ఆక్యుపెన్సీతో నిర్వహించుకునేందుకు BCCI అనుమతించడం విశేషం.అందుకు సంబంధించిన టికెట్లు ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చాయని తెలిపింది BCCI.
ఇక BCCI తీసుకున్న ఈ నిర్ణయం వలన మరింత మంది క్రికెట్ అభిమానులు డైరెక్ట్ గా ఈ మ్యాచును చూసే వెసులుబాటు దొరికింది అని ‘బుక్ మై షో’ నిర్వాహకులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.T20 మెగా టోర్నీ 15వ సీజన్‌కు సంబంధించిన మ్యాచులన్నీ మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, ఎంసీఏ మైదానాల్లో జరుగుతున్నాయి.కరోనా కారణంగా తొలుత 25% మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాల్లోకి అనుమతించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఇక ప్రస్తుత పరిణామాలతో దానికి డబుల్ కూర్చోవడానికి వెసులుబాటు కల్పించింది బిసిసి.

ఇక తాజాగా, ఏప్రిల్ 2 నుంచి అన్ని రకాల కరోనా నిబంధనలను ఎత్తివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.ఈ నేపథ్యంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది.మెగా టోర్నీలో భాగంగా ఈరోజు అనగా ఏప్రిల్ 2, శనివారం 2 మ్యాచ్‌లు జరగనున్నాయి.మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబయితో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్.డీవై పాటిల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.ఎంసీఏ వేదికగా రాత్రి 7.30 గంటలకు దిల్లీ, గుజరాత్ పోటీపడనున్నాయి.వీటిని అభిమానులు ఎంచక్కా చూడగలరని ఈ సందర్భంగా బుక్ మై షో హర్షాన్ని వ్యక్తం చేసింది.







