ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్ మరియు అధికార యంత్రాంగం పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలోనే అద్భుత రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అని కొనియాడారు.
ఉమ్మడి 23 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కంటే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బాగా అభివృద్ధి జరిగిందని లెక్కలు తెలియజేశారు.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని పేర్కొన్నారు.
కులం, మతం, జాతి అన్న తేడా లేకుండా.అందరికీ మంచి చేస్తున్నామని .అందరిని సత్కరించే సంస్కారం తెలంగాణ సమాజానికి భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నా అని పేర్కొన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కారణంగా గతంలో వేలల్లో ఉన్న భూముల ధర ఇప్పుడు.
రూ.కోట్లలోకి పలుకుతుందని పేర్కొన్నారు.ఆర్థిక వృద్ధితో పాటు మరే ఇతర విషయాల్లో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని.స్పష్టం చేశారు.కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవాలని ఉద్దేశపూర్వకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వాటిని అధిగమించి సుపరిపాలన అందిస్తున్నామని.కేసీఆర్ ఉగాది వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.







