తెలుగు చిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్న మోహన్ బాబుకు కాస్త కోపం ఎక్కువ అన్న విషయం తెలిసిందే.తన ముందు ఎవరైనా తప్పు చేశారు అని తెలిసింది అంటే చాలు ఇక వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు.
ఇక మా ఎలక్షన్స్ సమయంలో అయితే బూతులు కూడా మాట్లాడారు ఆయన.అయితే కేవలం బయట వాళ్ళ విషయంలోనే కాదు అటు సొంత వాళ్ల విషయంలో కూడా మోహన్ బాబు అదే తీరులో వ్యవహరిస్తున్నారు అన్నది తెలుస్తుంది.గత కొంత కాలం నుంచి మంచు మనోజ్ మంచు వారి ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగానే గడుపుతున్నాడు.అయితే మంచు మనోజ్ ఇలా దూరంగా ఉండడానికి మోహన్ బాబు కారణమంటూ టాక్ వినిపిస్తోంది.
మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో మంచు మనోజ్ మనసు గాయపడిందని అందుకే వీరిద్దరి మధ్య గ్యాప్ కూడా కాస్త ఎక్కువగానే పెరిగిపోయిందని తెలుస్తుంది.అంతేకాదు మోహన్బాబు వ్యాపారాలు విద్యాసంస్థలు హోటల్స్ అన్నిటిని కూడా పెద్ద కొడుకు మంచు విష్ణు చూసుకుంటున్నాడట.
ఇక ఇలా వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే మంచు విష్ణు ఇక 24క్రాఫ్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించినట్లు తెలుస్తోంది.కానీ మంచు మనోజ్ మాత్రం అన్నీ ఉన్నా అదృష్టం లేని వాడిగా మిగిలిపోయాడు అంటూ టాక్ వినిపిస్తోంది.
అటు నిర్మాతలు దర్శకులు కూడా మంచు మనోజ్ ను కాస్త దూరంగానే పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంఎం ఆర్ట్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి.అహంబ్రహ్మాస్మి అనే సినిమా చేస్తున్నాడు మంచి వారి వారసుడు.సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీసుకురావాలని కావలసిన దానికంటే కాస్త ఎక్కువగానే ఖర్చు పెడుతున్నాడట మంచి మనోజ్.
అయితే ఇక ఈ సినిమా నిర్మాణంలో సహాయం అందిస్తామని చెప్పిన అన్న మంచు విష్ణు అటు శ్రీకాంత్ రెడ్డి కథ నచ్చకపోవడంతో కాస్త దూరం జరిగాడట.బడ్జెట్ పెడితే పెట్టావు కానీ పాన్ ఇండియాలో ఎక్కువ ఖర్చు ఎవరు చేయమన్నారు అని మోహన్ బాబు కూడా సీరియస్ గా ఉన్నారట.
ఇలా బడ్జెట్ సమస్యతో బాధపడుతున్న మంచు మనోజ్ కు అటు తండ్రి మోహన్ బాబు నుంచి అన్న విష్ణు నుంచి కూడా సపోర్ట్ లేదు అన్నది తెలుస్తుంది.







