ఇద్ద‌రు యువ తేజాలు క‌లిసిన వేళ ! ఎందుకంటే ?

ఒక‌ప్పుడు మిట్ట‌ల్ స్టీల్స్‌గా విశ్విఖ్యాతి పొందిన ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ సీఈఓ ఆదిత్య మిట్ట‌ల్ అంద‌రికి సుప‌రిచితుడు.మిట్ట‌ల్ స్టీల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ల‌క్ష్మి మిట్ట‌ల్ కుమారుడు ఆదిత్య‌.

 When Two Young Spirits Meet Because , It Minister Ktr , Aditya Mittal , Mittal-TeluguStop.com

ఇటీవ‌లే ఆయ‌న ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ సీఈఓగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.ఈక్ర‌మంలో ఆదిత్య హైద‌ర‌బాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

కాగా మంత్రి కేటీఆర్ ఆయ‌న‌తో భేటీ అయ్యారు.ఈ విష‌యం కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డిస్తూ ఫొటోను షేర్ చేశారు.

హైద‌రాబాద్ అల్లుడు ఆదిత్య అంటూ చెప్పుకొచ్చారు.అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ పెట్టుబడుల గురించి చ‌ర్చించాన‌ని వెల్ల‌డించారు.

అలాగే బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం ఎర్పాటు చేయాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌ని కేటీఆర్ మిట్ట‌ల్‌కు హీమీనిచ్చార‌ట‌.ఉక్కుయ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు బ‌య్యారం అత్యంత అనుకూలంగా ఉంటుంద‌న్నార‌ట‌.

స‌హ‌జ సంప‌ద ఇనుప ఖ‌నిజం విస్తృతంగా ఉంద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తుంద‌ని వివ‌రించార‌ట‌.స్ధానిక వ‌న‌రుల స‌ద్వినియోగం, ఉపాధి క‌ల్ప‌న‌, ఉక్కు ఉత్స‌త్తుల ఎగుమ‌తుల ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని విన్న‌వించార‌ట‌.

ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చిన విధంగా బయ్యారంలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్ప‌టు చేస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చింద‌ని, కానీ నేడు నిల‌బెట్టుకోలేద‌ని చెప్పారు.ఈ క్ర‌మంలో ప్ర‌యివేటు రంగంలో ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు మిట్ట‌ల్ సంస్థ ముందుకు రావాల‌ని కేటీఆర్ ఆకాంక్షించార‌ట‌.

Telugu Aditya, Company, Hyderabad, Ktr, Lakshmi, Steels, Steel-Telugu Political

స్టీల్ ప్లాంట్ కు సంబంధించి భూ కేటాయింపుల‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, దేశంలోనే అత్యుత్త‌మ పారిశ్రామిక విధానం అమ‌లులో ఉంద‌ని చెప్పుకొచ్చార‌ట‌.మెగా ప‌రిశ్ర‌మ హోదా కింద రాయితీలు ఇస్తామ‌ని కేటీఆర్ వెల్ల‌డించార‌ట‌.ఇక‌పోతే బ‌య్యారం జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో ఉంద‌ని, వ‌రంగ‌ల్ జిల్లాలోని మామునూరు వ‌ద్ద విమానాశ్ర‌యాన్ని పున‌రుద్ధ‌రించే స‌న్నాహాల్లో త‌మ ప్ర‌భుత్వం ఉంద‌ని వివ‌రించార‌ట‌.అలాగే కొత్త‌గూడెం వ‌ద్ద కొత్త విమానాశ్ర‌య ప్ర‌తిపాద‌న చేసిన‌ట్టు తెలిపార‌ట‌.

కాగా ఆదిత్య హైద‌రాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఈక్ర‌మంలో తెలంగాణ‌కు మేలు చేసేందుకు చొర‌వ చూపాల‌పి ఆదిత్య‌ను కేటీఆర్ ఆహ్వానించార‌న‌రి తెలిసింది.

కేటీఆర్ విన్న‌పం మేర‌కు ఆదిత్య సానుకూలంగా స్పందించ‌న‌ట్టు కేటీఆర్ వెల్ల‌డించారు.త్వ‌ర‌లోనే ఆదిత్య బృందం ప‌ర్య‌టిస్తుంద‌ని వెల్ల‌డించార‌ట‌.

మ‌రి బ‌య్యారం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు క‌ల సాకారం అవుతుందా ? లేదా ? అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube